మొత్తానికి ఏపీలో పీఆర్సీ ఎపిసోడ్ కథ సుఖాంతమైంది. కొన్ని సంఘాలు ఇంకా అసంతృప్తిలో ఉండి ఆందోళనలు కొనసాగిస్తున్నా.. JACలు తమ డిమాండ్స్‌లో ఎంతో కొంత మెరుగ్గా సాధించుకోగలిగాయి. దీంతో ఆ క్రెడిట్ నాదంటే నాదనే గేమ్ మొదలైంది. మేమే సెగ రాజేశాం అంటే.. కాదు మేమే అని పోటీపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ సంఘాల నేతల క్రెడిట్ ఫైట్‌ఆంధ్రప్రదేశ్‌లో కొద్ది నెలలపాటు సాగిన పీఆర్సీ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్‌కార్డ్ పడింది. ఫిట్‌మెంట్ 23 శాతం కంటే ఒక్క…
సాధారణంగా నడక ముందుకు సాగుతుంది. కానీ ఏపీలో ఉద్యోగులు మాత్రం రివర్స్ గా నడిచి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రివర్స్ పీఆర్సీ ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో జనవరి నెలకు సంబంధించి తమకు పాత వేతనాలే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నసంగతి తెలిసిందే. పీఆర్సీ సాధన…
ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలను చల్లబరిచే ప్రయత్నం చేశారు సీఎం జగన్. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ అదిరే శుభవార్త అందించారు. పీఆర్సీ వల్ల హెచ్ ఆర్ఏ తగ్గిందని భావించే ఉద్యోగులకు ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ ని రెట్టింపు చేసేసింది. విజయవాడ పరిసరాల్లో ఉన్న హెచ్ఓడీ కార్యాలయాల్లోని ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ జోవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉద్ధృతం చేసిన తరుణంలో.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ…
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు, సాధారణంగా ఐఆర్ కంటే ఫిట్ మెంట్ ఎక్కువగానే ఉంటుంది.పీఆర్సీ అంటే వేతనాలు పెరిగాలి తగ్గకూడదని తెలియదా..?అధికారులు చదువుకున్నారో… గాడిదలు కాశారో అర్ధంకావడం లేదు. READ ALSO నూతన జిల్లాల ఏర్పాటు శుభ పరిణామం: తమ్మినేని సీతారాం బడ్జెట్ అంతా ఉద్యోగుల వేతనాలకే సరిపోతున్నాయని ప్రభుత్వం అంటోంది.మాకిచ్చే డబ్బులు కూడా మా పిల్లల తిండికే సరిపోతున్నాయి.మా…
సీఎస్ సమీర్ శర్మపై మరోసారి విరుచుకుపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత సూర్యనారాయణ. ఉద్యోగుల తరపున సీఎంతో సంప్రదింపులు జరపాల్సిన వ్యక్తి సీఎస్సే. పీఆర్సీ విషయంలో సీఎస్ తన బాధ్యతల్లో విఫలమయ్యారని గతంలోనూ చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా అన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఉద్యమానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారుల సంఘం తరపున ప్రద్యుమ్న నన్ను తప్పు పట్టారు.సీఎస్ విషయంలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయం నా ఒక్కడిదే కాదు.. పీఆర్సీ సాధన సమితి…
సీఎస్ కు సమ్మె నోటీసులు ఇచ్చిన తరవాత పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇది చాలా బాధాకరమైన రోజు. వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం అధికారుల కమిటీ మాటలనే వినింది. ప్రభుత్వం సమాజాన్ని తప్పుదోవ పుట్టిస్తోంది. ఈ నెల పాత జీతాలనే ఇవ్వండి అని కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఇది ఆషామాషీ వ్యవహారం…
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మొండివైఖరిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ పై కీలకంగా చర్చలు జరిగాయి. అన్ని సంఘాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి వచ్చాయి. సమ్మె నోటీసులో పీఆర్సీ, అనుబంధ అంశాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు పొందుపరుస్తామన్నారు. వైద్యారోగ్యశాఖ విషయాలను, అక్కడ వున్న కార్మిక చట్టాలకు అనుగుణంగా సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు వివరించారు. 7వ తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి నిరసనకు దిగుతారన్నారు. పాత జీతం ఇవ్వాలని…
ఏపీలో ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. ఉద్యోగసంఘాలన్నీ కలిపి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తామని ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమరానికి సై అంటున్నాయి అన్ని సంఘాలు. పీఆర్సీ వల్ల కలిగిన నష్టాలను పూడ్చాలని డిమాండ్ చేశాయి. నాలుగుజీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే… ఏపీ ఉద్యోగ సంఘ నేతలకు జీఏడీ సెక్రటరీ శశి భూషణ్ ఫోన్ చేశారు. రేపు మంత్రులతో…