నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా తాజాగా రిలీజ్ చేసిన కేతిక శర్మ ఐటెం సాంగ్ ఒక్కసారిగా అందరి దృష్టి సినిమా మీద పడేలా చేసింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మీద విమర్శలు వినిపిస్తూనే ఉన్నా సాంగ్ బాగుండడంతో ప్రేక్షకులు ఈ సినిమా మీద ఆసక్తి కనబరుస్తున్నారు.
Sai Pallavi : చీరకట్టులో సాయిపల్లవి డ్యాన్స్.. ఎంత ముచ్చటగా ఉందో
ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాకి నితిన్ కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ నాన్ దియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ ఫైవ్ సంస్థ కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు కొనుగోలు చేసింది. నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ రేటుకు ఈ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇవి తెలుగు భాషకు చెందిన హక్కుల మాత్రమే. ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ తో పాటు ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ కూడా నిర్మాత దగ్గరే ఉన్నాయని చెబుతున్నారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే వాటిని కూడా జీ5 సంస్థ మంచి రేటుకి కొనుగోలు చేసే అవకాశం ఉందా? లేదా ఇతర ఓటీటీలు ఆసక్తి కనబరిచినా అందులో ఆశ్చర్యం లేదు