ఎండాకాలం రానే వచ్చింది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధవారం (12-03-25) కృష్ణా జిల్లా ఉంగుటూరు, ఉయ్యూరు మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలు,…