Hanmakonda : మొంథా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసేసింది. మరీ ముఖ్యంగా హన్మకొండ జిల్లాను నిండా ముంచింది. నగరంలో ఎటు చూసినా వరద నీళ్లే ఉన్నాయి. దాదాపు అన్ని కాలనీలు నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్ మొత్తం నీట మునిగింది. దాదాపు 4వేల ఇండ్ల దాకా నీట మునిగినట్టు అధికారులు చెబుతున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రజలంతా ఇండ్ల మీదకు ఎక్కి సాయం కోసం చూస్తున్నారు. చాలా మంది ఇండ్లను ఖాళీ…
CM Chandrababu Aerial Survey: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కు చేరుకున్న…
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చేస్తారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు విజిట్ చేయనున్నారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం ల్యాండ్ అవనున్నారు. ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను…
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 35 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు సందర్శించారు.
Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీ నుంచి రైతులకి మంచి చేయాలని వచ్చామన్నారు.
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. రెండు రోజుల నుంచి వానలు కాస్తు తగ్గుముఖం పడటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు.. రేపు గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి.. వరద పరిస్థితిని పరిశీలించనున్నారు. వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేసి, వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇందుకోసం కేసీఆర్ శనివారం రాత్రే వరంగల్ చేరుకున్నారు. భద్రాచలంకు రోడ్డు మార్గం ద్వారా సీఎం పయనమయ్యారు. రేపు సోమవారం వరంగల్ మీదుగా…
కడప, తిరుపతి వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు సీఎం. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు ముఖ్యమంత్రి. హెలికాప్టర్ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన…
ఏపీలో నాలుగు జిల్లాలను నిండా ముంచాయి వానలు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తినష్టం కల్గించాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయ్. ఇవాళ సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.పది రోజుల నుంచి ఒకటే వర్షాలు. పట్టిన ముసురు తొలగలేదు. ఒకదాని తర్వాత ఒకటి వరసగా మూడు వాయు గుండాలు..తీరని నష్టాన్ని మిగిల్చాయ్. నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలో కురుస్తున్న వర్షాలతో మూడు జిల్లాలు తలకిందులయ్యాయి. భారీ కుంభవృష్టి, వరదలతో చిత్తూరు,…
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా…