CM Jagan Mohan Reddy: ఆదాయం సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఖజానాకు ఆదాయం సమకూర్చిపెట్టే శాఖలపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఆదాయాల పరంగా వివిధ శాఖలు, వాటి లక్ష్యాలను సమీక్షించారు సీఎం. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని తెలిపారు అధికారులు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.31లక్షల కేసులు కాగా, 2021–22లో 278.5 లక్షలకు తగ్గిందని తెలిపారు. 2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021–22లో 82.6 లక్షల కేసులకు తగ్గిందన్నారు. 2018–19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లు కాగా, 2021–22లో మద్యం విక్రయయాలపై ఆదాయం రూ. 25,023 కోట్లుగా పేర్కొన్నారు అధికారులు.
రేట్లు షాక్ కొట్టేలా పెట్టడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు సీఎం. బెల్టు షాపులు ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడంతో వినియోగాన్ని బాగా నియంత్రించామన్నారు సీఎం. లీకేజీలు లేకుండా, పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సీఎం ఆదేశాలిచ్చారు. గడచిన ఆరు నెలల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తంగా 20,127 కేసులు నమోదు చేశామని తెలిపారు అధికారులు. ఇందులో 16,027 మందిని అరెస్టు చేయగా, 1,407 వాహనాలు సీజ్ చేశామన్నారు అధికారులు. నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు అధికారులు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలని సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. స్వయం ఉపాధి పెంచి, వారికి గౌరవ ప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ప్రతి కాలేజీ, యూనివర్శిటీల ముందు ఎస్ఈబీ నంబర్‌ను డిస్ప్లే చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్ఈబీ నంబర్‌తో బోర్డులు పెట్టాలన్న సీఎం…ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి వ్యవహారాలు ఉండకూడదని ఆదేశించారు.
గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందకు సాగాలన్నారు. మంచి పంటలను సాగుచేయడానికి అవసరమైన విత్తనాలు, ఇతర సహాయ సహకారాలు వారికి అందించాలన్నారు. దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయిసాగుపై దాడులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే వివిధ పంటలకు సంబంధించి విత్తనాలు అందించామన్నారు అధికారులు. గంజాయిని వదిలేసి వివిధ పంటలు సాగుచేస్తున్న వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు.
ఏసీబీకి సంబంధించిన 14400 నంబర్ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్దా కనిపించాలని సీఎం ఆదేశించారు. దీనికోసం కచ్చితంగా బోర్డులు పెట్టాలన్నారు సీఎం. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులకు కొత్తరూపు ఇవ్వాలని, పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో వీటిని తీర్చిదిద్దాలన్నారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు పొంది, లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనులను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలన్నారు. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్స్‌లో ఉండేలా చూడాలన్నారు. ఒకవేళ ఆపరేషన్స్‌లో లేకపోతే కారణాలు కనుక్కొని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని, గ్రేడింగ్‌లో థర్డ్‌పార్టీచేత కూడా పరిశీలన చేయించాలన్నారు సీఎం.
ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖమంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, అడిషనల్ డీజీ ఎ రవిశంకర్, అటవీ పర్యావరణశాఖ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!