ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3175 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1900028 కి చేరింది. ఇందులో 1851859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 35, 325 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 29 మంది మృతి చెందారు.
read also : జగన్ పాలనలో పోలీసులు తప్ప ఎమ్మెల్యేలు కనపడటం లేదు !
దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12, 844 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 3692 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 94, 595 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.