‘యాస్’ అతి తీవ్ర తుఫాను బలహీనపడగా మిగిలి ఉన్న భాగం తీవ్ర అల్పపీడనంగా తూర్పు ఉత్తర ప్రదేశ్ ఈ యొక్క తూర్పు ప్రాంతాలు మరియు దానిని ఆనుకుని ఉన్న బీహార్ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది రాగల 12 గంటలలో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్టణం తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్టణం తూర్పు & పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈరోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఈరోజు రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.