ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య తో పాటుగా పాజిటివిటి రేటు కూడా పెరుగుతున్నది. దీంతో ఏపీలో ప్రస్తుతం ఉదయం, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చి 18 గంటలపాటు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా కేసులు తగ్గక పోవడంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఈరోజు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలులో ఉండబోతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు యధావిధిగా తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు జరుగుతుంది.