Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy Venkatarami Reddy: తెలుగు సెలబ్రిటీల మౌనంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, ప్రముఖుల స్పందనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌కు గతంలో తన తల్లి, కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించలేదని, అయితే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విద్యార్థులు విమర్శించారనే అంశంపై స్పందించారని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు..
ఢిల్లీలో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తప్పుబట్టారని, ధైర్యంగా ముందుకొచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడించారని ఆయన అన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు ఒక్కరు కూడా స్పందించలేదని దుయ్యబట్టారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలు దూరమవుతాయనే భయమా? లేక ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తుల భయమా? అని ప్రశ్నించారు కేతిరెడ్డి… అలాంటి భయాలతో మౌనం పాటిస్తే సెలబ్రిటీలు అనే గుర్తింపుకు అర్థమేంటని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి..
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
తాజావార్తలు
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..