మానవత్వం మంట గలిపి మానవ సంబంధాలకు విలువలు లేకుండా సభ్యసమాజంలో చివరకు శిశువును సైతం విక్రయించే దారుణానికి ఒడిగట్టారు. దత్తత పేరుతో శిశువును కొనుగోలు చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గుమ్మఘట్ట మండలంలోని నేత్రపల్లి గ్రామానికి చెందిన బళ్లారి రూపమ్మకు 15 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. ఆమెకు అంతకు ముందు ఆరేళ్ల బాలిక కూడా ఉంది.
Raised On Streets Of Patna, 8-Year-Old Boy Now Set To Board US Flight: బీహార్ పాట్నా వీధుల్లో పెరిగిన ఓ 8 ఏళ్ల అనాథ బాలుడు.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఈ ఘటన మనుషుల్లో మానవత్వం, మంచితనం ఇంకా మిగిలి ఉందని చెప్పే ఘటన. పాట్నాకు చెందిన అనాథ బాలుడు అర్జిత్ స్టోరీ ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ జంట ఈ అనాథ బాలుడిని దత్తత…
సినీనటి కరాటే కళ్యాణి(karate kalyani) దత్తపుత్రిక వివాదంపై అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని కళ్యాణి నివాసంలో ఆమె తల్లి విజయలక్ష్మి, సోదరుడిని చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ స్కీం అధికారులు ప్రశ్నించారు. కరాటే కళ్యాణి అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకున్నారంటూ 1098 నంబర్ కు ఫిర్యాదు వచ్చిందని.. అందుకే పోలీసుల సహకారంతో వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు విచారణ జరుగుతున్న సమయంలో కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి, తమ్ముడిని ప్రశ్నించామన్నారు. నగరంలోనే ఓ…
గత మూడు రోజులుగా హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థపై ద్రుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా. యాభై ఏళ్ళ క్రితమే హార్వెస్ట్ ఇండియా సంస్థను స్థాపించారు. పేదలకు, అస్వస్థతతో ఉన్న వారికి, అనాధ పిల్లలకు సేవ చేయడమే ఈ సంస్థ లక్ష్యం. పదిహేను అత్యున్నత సేవా అవార్డులను అందుకున్నాంమన్నారు. నా భర్త కత్తెర సురేష్ కుమార్ అరెస్టు అంటూ వార్తలు రాశారు. నా భర్త విదేశాల్లో ఉన్నారు. మాపై కొందరు కావాలనే…
యూపీలోని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పిల్లలను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 ప్రకారం సింగిల్ పేరెంట్ కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలిపింది. యూపీలోని వారణాసికి చెందిన ట్రాన్స్‌జెండర్ 2000 డిసెంబర్ 16న ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంట తాజాగా ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించగా.. వాళ్లు వివాహ…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ పేద కుటుంబానికి చెందిన నేపాలీ బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించాడు. కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఓ కుటుంబం ఉందన్న విషయం తెలుసుకుని… ఆ పాపను తాను దత్తత తీసుకున్నానని బండ్ల గణేష్ ప్రకటించాడు. Read Also: ఏపీ గవర్నమెంట్ పై నవదీప్ ‘టమాట’ సెటైర్ సదరు పాప…