Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: అనంతపురం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య నెలకొన్న వివాదం కొత్త మలుపు తిరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం అద్దెకు నివసిస్తున్న ఇంటిని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం జిల్లాలో రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ నెల 7వ తేదీన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కలమాడి రుక్మిణి ఇంటిని కొనుగోలు చేశారట ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు .. ఐదు సంవత్సరాలుగా అద్దె కట్టకుండా వైసీపీ కార్యకర్తకు చెందిన శ్రీనివాస్ ఇంట్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్నాడనే ఆరోపణలు ఉండగా.. రెండు కోట్ల 85 లక్షల రూపాయలకు ఆ ఇల్లు కొనుగోలు చేస్తున్నట్లు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటిని అగ్రిమెంట్ చేసుకున్న మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ..
ఇక, ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు తనపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేసిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు .. ఐదు గంటలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటి వద్దకే వెళ్తానని ప్రకటించారు.. అయితే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటిని కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుని తోపుదుర్తికి షాక్ ఇచ్చారు ఎంఎస్ రాజు.. మరోవైపు.. ఎంఎస్ రాజు మాట్లాడుతూ, తనపై తోపుదుర్తి చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. అవసరమైతే తాను తోపుదుర్తి నివాసానికి వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది.
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ఇదే సమయంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. మంత్రి నారా లోకేష్‌పై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
మరోవైపు.. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కూడా స్పందించారు. ఎస్ఆర్సీ కంపెనీ టిప్పర్ వాహనం, తోపుదుర్తి వాహనం ఒకేసారి రావడం యాదృచ్ఛికమని ఆయన తెలిపారు. దీనిని హత్యాయత్నంగా చిత్రీకరించడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. ఆస్తులు కలిగి ఉండటం ప్రతి ఒక్కరి హక్కేనని, సామాజిక వర్గాల వారికీ ఆస్తులు ఉండకూడదనే భావన సరైంది కాదని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!