Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. సాయికృష్ణ కేసు నుంచి సుగాలీ ప్రీతి ఉదంతం వరకు ప్రతి విషయంలోనూ పవన్ ప్రజలను, బాధితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించి న్యాయం చేస్తామని చెబుతుంటే.. మరోవైపు పవన్ కళ్యాణ్ ఏమో సాయికృష్ణను ఒక క్రిమినల్ అని మాట్లాడుతున్నారని అన్నారు. అదే సమయంలో జనసేన నేత సామినేని ఉదయభాను సాయికృష్ణ తల్లిని ఓదార్చేందుకు వెళ్లి.. పవన్ కళ్యాణ్ పంపిస్తేనే వచ్చామని చెబుతున్నారు. అసలు పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి అని అన్నారు. వైసిపి నేతలను తాటతీస్తామంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు.
“రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడొచ్చా? మీ ఎమ్మెల్యే పంతం నానాజీ భాష ఎలా ఉందో చూశారా? అసలు ఎవరు గూండాలు? పవన్ గారూ.. మీరు ఏడు జన్మలెత్తినా మమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ఉడత ఊపులకు, సొల్లు కబుర్లకు ఇక్కడెవరూ భయపడరు” అని స్పష్టం చేశారు. “నేను హోంమంత్రిగా లేకపోవడం మీ అదృష్టం” అని పవన్ అనడం ద్వారా ప్రస్తుతం ఉన్న హోంమంత్రి సరిగ్గా పని చేయడం లేదని ఆయనే ఒప్పుకున్నట్లయిందని అంబటి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని తాను సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తున్నానని పేర్కొన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, ముంబై దాడుల నిందితుడు కసబ్‌ను కూడా చట్టప్రకారమే శిక్షించారని గుర్తు చేశారు. సాయికృష్ణ కేసులో ఒక అధికారి విచారణ జరుపుతుండగా హఠాత్తుగా ‘సిట్’ (SIT) వేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ నాటకాలు ఆడుతున్నారని, ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ లేదా ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోనసీమలో కాపు నేతల సమావేశంపై పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, గతంలో కులాల గురించి పవన్ మాట్లాడినట్లుగా ఈ రాష్ట్రంలో ఎవరూ మాట్లాడి ఉండరని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఒకవైపు సాయికృష్ణ ఇంటికి జనసేన నేతలను పంపుతూ.. మరోవైపు ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజును అరెస్ట్ చేయవద్దని ఆందోళనలు చేయించడం పవన్ దుర్మార్గపు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్‌లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
- YS Jagan : రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
తాజావార్తలు
-
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
-
CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
-
Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
-
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
-
Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!