రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనను చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్‌ను విభజించిన జగన్ ప్రభుత్వం మదనపల్లికి జిల్లా కేంద్రం విషయంలో మదనపల్లి ప్రజలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని దూరం చేసిందన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటన చేయకపోతే ఆందోళన తీవ్ర…
కుప్పం వేదికగా ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా జరిగిన గొడవతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలు ప్రచారం చేయకుండా అధికార పార్టీ కుట్రలు చేస్తోందంటూ.. డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. కుప్పంలో టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు టీడీపీ అధ్యక్షుడు నానిలను అదుపులోకి తీసుకున్నారు. కుప్పం మున్సిపల్ ఆఫీస్…