AP DSC: మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనుంది ప్రభుత్వం.. 16 వేల 347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించారు.. వీరిలో 15 వేల 941 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు.. అయితే, ఈ రోజు నియామక పత్రాల పంపిణీ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమానికి డీఎస్సీ అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో పాటు హాజరుకానుండగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప…
డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇకపై ప్రతి ఏటా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తాం అన్నారు.. ఉపాధ్యాయులపై అనవసరమైన ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు లోకేష్... ఇప్పటికే 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించామన్నారు లోకేష్... అనవసర శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయం వృథా చేయొద్దని అధికారులకు సూచించారు మంత్రి లోకేష్.. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.. విద్యా శాఖ…
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జూన్ 06 నుంచి 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి. అయితే పరీక్షలు రాస్తున్న టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీనికి గల కారణం ఏంటంటే.. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు…
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.. డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు... కానీ, ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ నిబంధన అమలు చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన ప్రకారం మెగా డీఎస్సీని ప్రకటించాం.. అవసరమైతే గిరిజనల కోసం స్పెషల్ డీఎస్సీ వేస్తామని తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ డిగ్రీ కళాశాల అదనపు భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పనికిమాలిన పనుల వలన ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.. గత ప్రభుత్వ తప్పిదాల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోన్నాం.. ఎటువంటి అభివృద్ధి…
నిరుద్యోగులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ పండుగలాంటి వార్తను నారా లోకేష్ ప్రకటించారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అవుతున్నారని, ఉపాధ్యాయులకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా చూసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని మంత్రి లోకేశ్ చెప్ప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రసంగించారు. ‘ఎన్నికలకు రెండు నెలల ముందు గత…
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినట్లు అధికారులు ధృవీకరించారు. మొదట బుధవారమే విడుదల కావాల్సి ఉండగా, వివిధ అనివార్య పరిస్థితుల కారణంగా ఇప్పుడు ప్రకటన ఆలస్యం అవుతుంది. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.