CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: 40 ఏళ్లుగా తమ ఇళ్లపై పూర్తి హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల కల సాకారం కానుంది. విశాఖపట్నం వేదికగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న 28,445 కుటుంబాలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హక్కుదారు పట్టాలను పంపిణీ చేయనున్నారు. దీని విలువ రూ.8,874 కోట్లు. మొత్తం 399 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తూ 19,33,853 చదరపు గజాలను పేద కుటుంబాలకు హక్కులు కల్పించనున్నారు. విశాఖలో ఇంత పెద్ద ఎత్తున క్రమబద్ధీకరణ చేపట్టి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఇదే తొలిసారి. ఇల్లు నిర్మించుకుని దశాబ్దాలుగా అందులో నివసిస్తున్నా.. ఆ ఇంటి స్థలంపై పూర్తి హక్కు లేకపోవడం అనేక కుటుంబాలను వేధిస్తున్న సమస్య. పట్టా లేకపోవడంతో ఆస్తిని పూర్తిస్థాయిలో అనుభవించలేని పరిస్థితి.. బదలాయించుకోక… భవిష్యత్తుపై భరోసా లేకపోవడం వంటి సమస్యలకు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీతో ఇన్నాళ్లూ పడిన కష్టాలు గట్టెక్కనున్నాయి. విలువైన ఆస్తి, భవిష్యత్తుకు భద్రత, పిల్లలకు వారసత్వ సంపద, ఆత్మగౌరవం, భరోసా కల్పించేలా అంగరంగ వైభవంగా విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది.
కాగా, తన విశాఖ పర్యటనపై సోషల్ మీడియా వేదికగా శుక్రవారం రోజు స్పందించిన సీఎం చంద్రబాబు.. ”దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోంది…తమ ఇంటిపై హక్కును పొందాలనే వేలాది కుటుంబాల కల సాకారం కానుంది. తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకు విశాఖ వస్తున్నా!” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు… ఆ స్థలాలను క్రమబద్ధీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. మీ ఇంటిపై మీకు హక్కును కల్పిస్తూ 28,445 కుటుంబాల కలలను నిజం చేస్తున్నాం. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి ఇంటి స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం. ఇది కేవలం పట్టాల పంపిణీ కార్యక్రమం కాదు… 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భం. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది… భవిష్యత్తుకు భద్రత కలుగుతుంది….. బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది… ఆత్మగౌరవం, భరోసా దక్కుతుంది. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇంటిపై హక్కు కోసం ఎదురుచూసిన ప్రతి కుటుంబంలో ఆనందం చూడటమే మా ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి.. అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు..
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు