Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ నిమజ్జనంలో డీజే వాహనాలకు అనుమతుల అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన విజ్ఞప్తిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. లోకేష్ ఎవరినీ ఆదేశించలేదని, కేవలం ప్రజలు, భక్తుల తరఫున విజ్ఞప్తి మాత్రమే చేశారని తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తి భావంతో, ప్రశాంతంగా సాగాలన్నదే లోకేష్ ఉద్దేశమని పేర్కొన్నారు. నిమజ్జన యాత్రలో భక్తి సామరస్యానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని కోరడంలో తప్పేముందని రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఒక మంత్రి చేసిన ప్రజాహిత విజ్ఞప్తిని ఆదేశంగా వక్రీకరించడం సమంజసం కాదన్నారు. లోకేష్ మాటల్లోని ఆప్యాయతను చూడాలని, ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా చిత్రీకరించడం సరికాదని పేర్కొన్నారు.
భక్తుల విశ్వాసాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను గౌరవించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గణేష్ నిమజ్జనం సజావుగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరితే అందులో ప్రొటోకాల్ ఉల్లంఘన ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని, అదే లోకేష్ చేశారని తెలిపారు. ప్రతి మాటలో తప్పులు వెతకడం, ప్రతి విజ్ఞప్తిని ఆదేశంగా చిత్రీకరించడం సమంజసం కాదని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్న వ్యక్తి వాస్తవాలను పరిశీలించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, భక్తి సామరస్యంతో సాగడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా భక్తులు, నిర్వాహకులు, అధికారులు పరస్పరం సహకరించాలని ఆయన కోరారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!