Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక..
- నూతన అసెంబ్లీ భవనంపై ఎత్తైన స్పియర్ నిర్మాణానికి ఆమోదం..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: అమరావతి రాజధాని పరిధిలో ప్రజా రవాణా కోసం ఓ మాస్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడ, గుంటూరు సహా సమీపంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఓ ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం వివిధ ప్రతిపాదనలకు ఆమోదాన్ని తెలియచేసింది. రాజధానిలో నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్ సహా లిఫ్ట్‌లను నిర్మించేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. రూ.661 కోట్ల వ్యయంతో స్పియర్ సహా లిఫ్ట్‌ల నిర్మాణానికి అథారిటీ సమావేశం ఆమోదాన్ని ఇచ్చింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది.
ఇక, హోటల్లు, పాఠశాలలకు భూములు కేటాయిస్తూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదం తెలియచేశారు. రెండో దశ పూలింగ్ లోనూ 1 ఎకరా కన్నా తక్కువ కమతం ఉన్న రైతులకు యాన్యుటీ చెల్లింపునకు సంబంధించి అథారిటీ ఆమోదం ఇచ్చింది. మరోవైపు అసెంబ్లీ భవనంలో వ్యూపాయింట్ ఏర్పాటు చేసే అంశంపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దే్శం చేశారు. ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికైన అసెంబ్లీ భవనంలో ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఈ స్పియర్ నిర్మాణం జరగాలని సీఎం సూచించారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న అసెంబ్లీ- హైకోర్టు- సచివాలయ టవర్లతో పాటు క్వాంటం టవర్స్ , బిట్స్ పిలానీ లాంటి భవనాలు కూడా ప్రత్యేకమైన కట్టడాలుగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు అమరావతి నగరంలో 50 శాతం సస్టెయినబుల్ గ్రీన్ కవర్ తో పాటు బయోడైవర్సిటీని కాపాడేలా చర్యలు చేపట్టాలని ఏడీసీ అధికారులను సీఎం ఆదేశించారు. పచ్చదనంతో పాటు పుష్ప జాతులకు చెందిన మొక్కలు నాటాలని అన్నారు. రాజధానిలో ఉన్న కొండలు, నీటి వనరులను కూడా అత్యుత్తమ ప్రాంతాలుగా తీర్చిదిద్దేలా ఓ బ్లూప్రింట్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
అమరావతి నగరం పేరును దేశవిదేశాల్లో మార్మోగేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఇటీవల లద్దాఖ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఓ బైకర్‌ను ఓ బాలుడు అమరావతి నుంచి వచ్చారా అంటూ మాట్లాడిన అంశం రాజధాని అమరావతి పేరు ప్రజల మనస్సుల్లోకి ఎంతగా చొచ్చుకు పోయిందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఇలా దేశ, విదేశాల్లోనూ అమరావతి ఘనతను చాటేలా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. విద్యుత్ స్తంభాలు లేని, బ్లూ గ్రీన్, డీప్ టెక్ , గ్రీన్ ఎనర్జీ లాంటి ఐదు అంశాలను థీమ్ గా అమరావతిని తీసుకెళ్లాలని అన్నారు. ప్రతీ పౌరుడూ ఇది నా నగరం అని భావించేలా అమరావతి పేరును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాజధాని నగరాన్ని నడిపేలా భవిష్యత్ రెవెన్యూ మోడల్స్ పై కూడా దృష్టి సారించాలని అన్నారు. దీనిపై ఓ కమిటీని నియమించి అధ్యయనం చేయాలన్నారు. విజయవాడ- గుంటూరు- మంగళగిరి- తాడేపల్లి కార్పోరేషన్లు కలిపి ఓ మెగా సిటీగా అమరావతి తయారవుతుందని సీఎం అన్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా అమరావతి అభివృద్ధి చెందుతుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..