YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Padayatra: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.. వచ్చే సంవత్సరం తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజలతో నేరుగా మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు “సినిమా చూపిస్తాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఆపివేసిందని జగన్ ఆరోపించారు. ప్రజల తరఫున వైసీపీ శ్రేణులు గట్టిగా పోరాటం చేస్తున్నాయని, వారి కృషిపై గర్వంగా ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఇప్పటికే ఐదేళ్ల కాలంలో సగం గడిచిపోయిందని, అయినప్పటికీ రాజధాని అంశంలో స్పష్టమైన పరిష్కారం చూపలేకపోయారని విమర్శించారు.
Read Also: Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. అమరావతిలో ఒక ఎకరానికి కనీస సదుపాయాలకే రూ.2 కోట్లు ఖర్చవుతుందని, మొదటి 50 వేల ఎకరాలకే రూ.1 లక్ష కోట్లు అవసరమవుతాయని అన్నారు. మరిన్ని ఎకరాలు అభివృద్ధి చేయాలంటే మొత్తం ఖర్చు లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. ఇంత భారీ వ్యయంతో రాజధాని నిర్మాణం సాధ్యమా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి తాము ప్రత్యామ్నాయ ప్రణాళికలను సూచించామని జగన్ వివరించారు. ప్లాన్-A కింద విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రతిపాదించామని గుర్తు చేశారు. ప్లాన్-B కింద మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని MAVIGUN గ్రోత్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సూచించామని తెలిపారు.
అమరావతిలో నిర్మించాల్సిన భవనాలను ఈ గ్రోత్ కారిడార్‌లో నిర్మిస్తే తక్కువ ఖర్చుతో, వేగంగా రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మొత్తం రూ.2 లక్షల కోట్ల భారాన్ని రాష్ట్రంపై వేయకుండా, దాని 10 శాతం ఖర్చుతోనే అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ప్రత్యామ్నాయాలను పక్కనబెట్టి చంద్రబాబు అమరావతిపైనే పట్టుబడుతున్నారని విమర్శించారు. దీనికి కారణం అమరావతి పేరుతో కాంట్రాక్టులు, కమిషన్లు సంపాదించడమేనని ఆరోపించారు. అమరావతి దోపిడీ, అవినీతికి కేంద్రంగా మారిందని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!