త్వరలోనే పార్టీ తరఫున యాప్ విడుదలచేస్తాం.. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే ఆ యాప్‌లో నమోదు చేయవచ్చు అన్నారు.. పలానా వ్యక్తి, పలానా అధికారి.. వారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు.. ఆధారాలు కూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు.. ఆ ఆధారాలన్నీ కూడా అప్‌లోడ్ చేయొచ్చు.. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్‌గా మన డిజిటల్ సర్వర్‌లోకి వచ్చేస్తోందన్నారు.. అయితే, ఆ ఫిర్యాదులపై మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా పరిశీలన చేస్తాం అని వెల్లడించారు.