YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి.. కేసులో మరింత విచారణ జరపాలి, కేసుతో సంబంధం ఉన్న కొందరి బెయిల్‌లను కూడా రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.. అయితే, ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఫైనల్ ఛార్జిషీట్ ఫైల్ చేసింది… నిందితుల బెయిల్ రద్దు విషయంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. అయితే, తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయాలని పిటిషనర్‌కు సూచించింది సుప్రీంకోర్టు.
Read Also: Team India Jersey Sponsor: టీం ఇండియాకు నయా స్పాన్సర్.. ఒక్క మ్యాచ్‌కు ఎన్ని కోట్లు అంటే?
ఇక, వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని కోర్టుకు తెలిపారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు.. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అన్నారు. వివేకా హత్య కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై స్పందిస్తూ. మీరు బస్ మిస్సయ్యారు.. ఛార్జిషీట్ ఇప్పటికే దాఖలైంది.. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలను ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించింది.. కోర్టులో ఇలాగే అప్లికేషన్స్ వేస్తూ వెళ్తే.. ట్రయల్ పూర్తి కావడానికి దశాబ్ద సమయం పడుతుందన్నారు.. ఈ దశలో మేం చేసేది ఏముంది ?.. నిందితులపై ఇప్పటికే హత్యా నేరారోపణలు నమోదు చేశారు కదా? అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.