Team India Jersey Sponsor: ఆసియా కప్‌లో మంచి జోష్ మీద ఉన్న టీం ఇండియాకు మరో గుడ్ న్యూస్. గతంలో టీం ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర సర్కార్ గేమింగ్ బిల్లు తీసుకొచ్చిన తర్వాత బీసీసీఐ ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగింది. తాజా సమాచారం ప్రకారం.. టీం ఇండియా కొత్త జెర్సీ స్పాన్సర్ రేసును అపోలో టైర్స్ గెలిచింది. ఇంతకీ ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఈ కొత్త స్పాన్సర్ ఒక్కో మ్యాచ్‌కు ఎన్ని కోట్లు ఇస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Kerala : కేరళను వణికిస్తున్న బ్రెయిన్ ఈటింగ్ వైరస్ ఇప్పటి వరకూ 16 మంది మృతి.. ప్రజల్లో ఆందోళన
డ్రీమ్ 11 కాదు.. అపోలో టైర్స్
గతంలో టీం ఇండియా జెర్సీపై ఉన్న డ్రీమ్ 11 స్థానాన్ని ఇకపై అపోలో టైర్స్ భర్తీ చేయనుంది. టీం ఇండియాతో అపోలో టైర్స్‌తో ఒప్పందం 2027 వరకు ఉండనున్నట్లు సమాచారం. ఈ సమయంలో భారత్ దాదాపు 130 మ్యాచ్‌లు ఆడవలసి ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ ఒప్పందం విలువ ఎంత?.. పలు నివేదికల ప్రకారం.. అపోలో టైర్స్ ఒక మ్యాచ్‌కు దాదాపు రూ.4.5 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఇది గతంలో చేసుకున్న ఒప్పందం మొత్తం కంటే రూ.50 లక్షలు ఎక్కువ. డ్రీమ్ 11 ఒప్పందం ఒక మ్యాచ్‌కు రూ.4 కోట్లు చెల్లించింది.
పోటీలో నిలిచి గెలిచిన అపోలో టైర్స్..
పలు నివేదిక ప్రకారం.. భారత క్రికెట్ జెర్సీ స్పాన్సర్ పోటీలో కాన్వా, జెకె టైర్ వంటి సంస్థతో పోటీ పడి అపోలో టైర్ గెలిచింది. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్‌గా ఈ రెండు సంస్థలను ఓడించి అపోలో టైర్స్ ఒప్పందాన్ని కైవసం చేసుకుంది. ఈ రేస్‌లో వీటన్నిటితో పాటు బిర్లా ఆప్టస్ పెయింట్స్ కూడా స్పాన్సర్‌గా మారడానికి ఆసక్తి చూపించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సంస్థ పోటీలో పాల్గొనడానికి బిడ్ చేయడానికి ముందుకు రాకపోవడం విశేషం.
READ ALSO: China – Pakistan: డ్రాగన్ వక్ర బుద్ధి.. పాక్ అధ్యక్షుడికి రహస్య స్థావరంలోకి ప్రవేశం..