వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతా రెడ్డి.. కేసులో మరింత విచారణ జరపాలి, కేసుతో సంబంధం ఉన్న కొందరి బెయిల్‌లను కూడా రద్దు చేయాలని వైఎస్ వివేకా కూతురు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ ఎం ఎం సుందరేష్, ఎంకే సింగ్ ల ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.. అయితే, ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.. ఈ కేసులో తదుపరి సీబీఐ విచారణ అవసరమా? లేదా? అనేదానిపై సమయం కోరారు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కే ఎస్ ఎన్ రాజు.. దీంతో, తదుపరి విచారణ పై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో హాట్ కామెంట్స్ చేశారు ఆయన కూతురు వైఎస్ సునీత.. గత రెండు రోజులుగా పులివెందులలో జరిగిన సంఘటనలు చూస్తుంటే నాన్న గారి హత్య గుర్తుకు వస్తుందన్న ఆమె.. గొడ్డలి పోటుతో వివేకా పడి ఉంటే.. గుండె పోటు అని చెప్పారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేసారు. హత్య తర్వాత లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి హత్య…
హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు.. ఇరువర్గాల వాదనలు వింది.. ఆ తర్వాత షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారన్న పేర్కొంది.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి మా రెడ్డి రంగారెడ్డికి అలియాస్ బీటెక్ రవికి రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు.. ఆ జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలన పేర్కొంది కడప కోర్టు.
Avinash Reddy: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీత పిటిషన్ దాఖలు చేశారు.