CM Chandrababu: గిరిజన సంక్షేమ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో నేడు ఉన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబుకు స్వయంగా వివరించారు అధికారులు. గత ప్రభుత్వానికి గిరిజన సంక్షేమమనేది అత్యంత అప్రధాన్యత శాఖగా చూసిందని అధికారులు సీఎం చంద్రబాబు దగ్గర వెల్లడించారు.. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.. 2014-19 మధ్య కాలంలో గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలను వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వెల్లడించారు.. అలాగే గిరిజనులకు సత్వర వైద్యం కోసం తెచ్చిన పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిన విధానంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, అరకు కాఫీ మార్కెటింగ్, ఇతర గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై చర్చ.
Read Also: CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..