UP: క్లాస్‌లో పోర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం
- ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఘటన
- బాలికలతో కలిసి క్లాస్ లో పోర్న్ చూసిన విద్యార్థులు
- మందలించి ఫోన్ లాక్కున్న ప్రిన్సిపల్
- దారిలో కాపుకాచి ప్రిన్సిపల్ పై విద్యార్థి దాడి
- తుపాకీ చూపి నగదు దోచుకెళ్లినట్లు తెలిపిన ప్రిన్సిపల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి.. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో మొబైల్‌లో పోర్న్ చూస్తున్నారు. దీంతో ప్రిన్సిపల్ మందలించారు. సెలవుల అనంతరం కొందరు విద్యార్థులు దారిలో చుట్టుముట్టి ప్రిన్సిపల్ ను చితక బాది.. డబ్బులు కూడా లాక్కెళ్లారు. బఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంత్ త్రివేణి పర్వత్ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
READ MORE: LV Subramanyam: విరాళాల సేకరణపైనే కాకుండా.. భక్తులకు మెరుగైన సేవలపై దృష్టి పెట్టండి..
Also Read
అసలేం జరిగిందంటే.. కాలేజీలో ఏడో పీరియడ్ సమయంలో క్లాస్‌లోని కొందరు విద్యార్థులు ఇతర బాలికలతో కలిసి ఓ గదిలో కూర్చుని మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ విద్యార్థులను మందలించి.. మొబైల్ లాక్కోవడంతో పాటు ఎనిమిదో పీరియడ్‌లో మళ్లీ అలా చేయవద్దని సూచించారు. మొబైల్‌ను తిరిగి ఇచ్చేశారు. అయితే క్లాస్ ముగించుకుని ప్రిన్సిపాల్ బైక్‌పై ఇంటికి వస్తుండగా ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టి కొట్టాడు. అంతే కాదు ఆ విద్యార్థి తనను తుపాకీతో బెదిరించి జేబులోంచి రూ.2200 తీసుకున్నాడని ప్రిన్సిపాల్ ఆరోపించారు. గట్టిగా అరవడంతో స్థానికులు వస్తారని బయపడి నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.
READ MORE: OTT : మరొక ఓటీటీలో విడుదల కానున్న సత్యభామ..ఎక్కడంటే..?
ప్రిన్సిపాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..
ఈ కేసులో నిందితుడైన విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ శశి శేఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై బాఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రాజేష్ పాండే మాట్లాడుతూ.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతున్నామన్నారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
READ MORE:IND vs SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మూడో టీ20 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!
కాగా..ఈ ఇంటర్ కాలేజ్ బీహార్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. కళాశాల నుంచి బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దూరం కేవలం ఒక కిలోమీటరు మాత్రమే. బీహార్ నుంచి 40 శాతం మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటారు. ఈ కళాశాలలో మొత్తం 2800 మంది విద్యార్థులు ఉన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు