Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
- ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..
- ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోందన్న సజ్జల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది.. ప్రజల్లో, పార్టీ క్యాడర్ లో ఇదే చర్చ జరుగుతోందన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ సజ్జల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీలో క్రియాశీలక విభాగంలో ఉన్న అందరి పాత్ర చాలా కీలకమైంది.. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు మించి స్థానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు.. అందరూ సమిష్టిగా పనిచేయడం వల్ల అరుదైన విజయం సాధించాం.. రాష్ట్ర అభివృద్ది జరగాలంటే గ్రాస్ రూట్ లెవల్‌లో బలంగా ఉండాలని సూచించారు.. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు, కక్షసాధింపు చర్యలు, వేధింపులు, రెడ్‌బుక్ రాజ్యాంగం ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది.. కానీ, ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలుచేయడం లేదు.. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయింది అని విమర్శించారు సజ్జల.. సామాన్యులు కూడా బలవుతున్నారు.. గవర్నెన్స్ పూర్తిగా బ్రష్టుపట్టింది.. మళ్లీ గెలవలేమన్న భయంతో కూటమి నేతలు ఎవరి స్థాయిలో వారు అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇక, ఈ ఏడాదిలో 1.67 లక్షల కోట్ల అప్పులు చేసింది కూటమి ప్రభుత్వం.. అమరావతిలో 40 వేల ఎకరాలు చాలవన్నట్లు మరో 40 వేల ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో దోపిడీ నేరుగా పదిశాతం కమిషన్ తీసుకుంటున్నారు.. వేలకోట్లు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ప్రజల ఆకాంక్షలు, కోరికలతో సంబంధం లేకుండా పాలన సాగుతోందని ఆరోపించిన ఆయన.. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుపై ప్రజలే నిలదీసేలా మన కార్యాచరణ ఉండాలన్నారు.. ప్రజలను చైతన్యం చేయడానికి అవసరమైన కార్యక్రమాలు చేయాలి.. వైసీపీ క్రియాశీలక సైన్యంగా 18 లక్షల మంది సిద్ధమవుతారు.. టెక్నాలజీని ఉపయోగించుకుని మన వాయిస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి..
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!