IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- భారత్‌కు ప్రతీ ఏడాది 36-40 యుద్ధవిమానాలు అవసరం..
- ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAF: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్ స్వ్కాడ్రన్ల సంఖ్య మరింత తగ్గకుడా ఉండాలంటే ప్రతీ ఏడాది భారత్‌కు 36 నుంచి 40 కొత్త యుద్ధ విమానాలు అవసమరని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. ఇది సుమారు రెండు ఫైటర్ స్వ్కాడ్రన్లకు సమానమని చెప్పారు. ప్రస్తుతం ఈ లోటును పూడ్చుకుంటూనే కొత్తగా మరిన్ని యుద్ధవిమానాలను చేర్చాల్సి ఉంటుందని చెప్పారు.
ఎయిర్‌ఫోర్స్ డేకు ముందు నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో ఏపీ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలోని ప్రాజెక్టుల్లో జాప్యం వైమానికదళ కార్యాచరణ సామర్థ్యంపై పడుతోందని ఆయన అన్నారు. టెక్నికల్ డిలే అంటే టెక్నాలజీని తిరస్కరించడమే అని అన్నారు. అభివృద్ధి, ఉత్పత్తి ప్రక్రియలు ఎక్కువ కాలం కొనసాగితే, అప్పటికే ప్రత్యర్థులు ఆ టెక్నాలజీని అధిగమించే అవకాశం ఉందని అన్నారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఫైటర్ జెట్ స్వ్కా్డ్రన్ల కొరతను అధిగమించేందుకు తేజస్ Mk-1A, తేజస్ Mk-2, 114 విమానాల MRFA ప్రాజెక్ట్, AMCA వంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. AMCA లేదా ఇతర ప్రాజెక్టుల్లో జాప్యం ఏర్పడితే ప్రత్యామ్నాయ యుద్ధ విమానాల వైపు చూడాల్సి వస్తోందని ఆయన అన్నారు. రష్యా తయారీ 5వ జనరేషన్ Su-57పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ఒప్పందం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖరారయ్యే అవకాశం ఉదని అన్నారు. ధర, ఇతర కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
పాకిస్తాన్-చైనా 5వ తరం యుద్ధ విమానాల విషయంలో సహకారం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఇదే సమయంలో ఆయా విమానాలను పాకిస్తాన్ తన యుద్ధవ్యవస్థలతో పూర్తిస్థాయిలో అనుసంధానం చేసుకోకపోతే లాభం ఉండదని చెప్పారు. థియేటర్ కమాండ్ల ఏర్పాటుపై ఎయిర్‌ఫోర్స్ వ్యతిరేకంగా లేదని, అయితే దాన్ని ఎలా, ఏ క్రమంలో అమలు చేయాలన్న దానిపై జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎదురైన అనుభవాల తర్వాత ఈ అంశంపై చర్చల్లో మార్పు వచ్చిందని తెలిపారు.
ఎయిర్‌ఫోర్స్ ఆధునీకీకరణలో ఏఐ, డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్స్, అంతరిక్ష సామర్థ్యాలు కీలకంగా మారుతున్నాయని, ప్రత్యేక డ్రోన్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కన్నా డ్రోన్లను ప్రస్తుత యుద్ధ వ్యవస్థతో సమన్వయం చేయడం అవసరమని ఐఏఎఫ్ భావిస్తోంది. ప్రస్తుతం భారత వైమానిక దళం ఫైటర్ స్క్వాడ్రన్ల కొరత ఏదుర్కొంటోంది. భారత్‌కు మొత్తం 42 స్వ్కాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరం. ప్రస్తుతం భారత్ వద్ద 29 ఉన్నాయి. సాధారణంగా ఒక్క స్వ్కాడ్రన్‌లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!