Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 12న ఉత్తర అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు తెలిపింది. ఇది క్రమంగా బలపడి 13వ తేదీ నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం 15వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ అల్లూరి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. నిన్న తిరుపతి, కడప జిల్లాల్లో అత్యధికంగా 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే బాపట్ల, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక, నైరుతి రుతుపవనాలు కూడా క్రమంగా తిరోగమిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, అనంతరం వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!