Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Flood Control System: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య విమర్శల పర్వం కొనసాగింది.. వర్షం పడిందంటే.. కృష్ణానదిలో వరద పెరిగిందంటే.. అమరావతిపైనే చర్చ సాగుతుంది.. అయితే, అమరావతి రాజధాని అత్యంత సురక్షితమైన నగరమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.. రాజధాని నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వర్షపు నీరు నిలిచే సమస్య ఎక్కడా ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లోని ట్రెంచ్‌లలో వర్షపు నీరు కనిపిస్తోందని తెలిపారు.
అమరావతిలో వరద నియంత్రణ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇందుకోసం నెదర్లాండ్స్‌కు చెందిన నిపుణుల సహకారంతో డిజైన్లు రూపొందించినట్లు చెప్పారు. గత 200 ఏళ్లలో నమోదైన వర్షపాత పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతే వరద నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన డిజైన్లను సిద్ధం చేసినట్లు వివరించారు. రాజధాని ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని సమర్థంగా నిర్వహించేందుకు కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అనే మూడు కెనాల్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో నీటిని వేగంగా బయటకు తరలించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
Also Read
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
అమరావతి వరద నియంత్రణ వ్యవస్థలో భాగంగా 22,500 క్యూసెక్కుల నీటిని బయటకు పంపించే సామర్థ్యంతో పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వర్షపు నీరు నిలిచే సమస్య ఉండదని, ఎక్కడా నీటి చుక్క కూడా నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ట్రెంచ్‌లలో వర్షపు నీరు కనిపిస్తోందని మంత్రి వివరించారు. పనులు పూర్తయిన తర్వాత నీటి పారుదల వ్యవస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని, రాజధాని ప్రాంతంలో వరద ముప్పును సమర్థంగా నియంత్రించగలమని తెలిపారు. అమరావతి రాజధానిపై కొందరు పనిగట్టుకుని రకరకాల తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనించాలని సూచించారు. శాస్త్రీయ అధ్యయనాలు, నిపుణుల సూచనల ఆధారంగా రాజధాని వరద నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!