Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు.. ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి రూ. 9151 కోట్లు
- విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం..
- రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు..
- అమరావతికి అనుసంధానం చేసే 56 కిలో మీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Minister Ashwini Vaishnaw: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించాలని సూచించిన ఆయన.. భూకేటాయింపులు పూర్తవగానే విశాఖ రైల్వే జోన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ అమరావతికి అనుసంధానం చేసే రూ. 2047 కోట్లు విలువైన 56 కిలో మీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ “డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్” ను నీతి ఆయోగ్ ఆమోదించిందన్న ఆయన.. విజయవాడ-ఏరుపాలెం-అమరావతి గుండా నంబూరుకు రైల్వే లైన్ నిర్మాణం జరగనుందన్నారు..
Read Also: Drugs Positive: ఇదేందయ్యా ఇది.. సొరచేపలకు ‘డ్రగ్స్ పాజిటివ్’
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఇక, ఈ ఏడాది ఏపీలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం రూ. 9151 కోట్లు కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు అశ్వినీ వైష్ణవ్.. ఏపీలో మొత్తం రూ. 73,743 కోట్లు విలువైన ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.. ఇప్పటి వరకు మొత్తం 743 ఫ్లైఓవర్లు, అండర్ పాసేజ్ వంతెనల నిర్మాణం జరిగాయి.. ఏపీలో 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ జరిగిందని స్పష్టం చేశారు.. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 73 “అమృత్” రైల్వే స్టేషన్లు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!