AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ముందకు సాగుతోంది కూటమి ప్రభుత్వం.. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. బీసీలను అణగదొక్కాలనే భావన కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, దాని అనుబంధంగా ఉన్న పిల్ల కాంగ్రెస్‌లోనూ ఉందని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై వైసీపీ వైఖరిని ప్రశ్నించారు. గతంలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను వైఎస్ జగన్ ప్రభుత్వం 24 శాతానికి ఎందుకు తగ్గించిందని సత్యకుమార్ ప్రశ్నించారు. న్యాయస్థానాల గురించి అవగాహన ఉన్న జగన్.. బీసీల సాధికారత విషయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని నిలదీశారు. బీసీలకు న్యాయం జరిగేలా సమస్యను పరిష్కరించేందుకు అప్పట్లో ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు మళ్లీ 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జీవో జారీ చేసిందని వెల్లడించారు సత్యకుమార్. అయితే, ఈ నిర్ణయాన్ని వైసీపీ న్యాయస్థానాల్లో సవాల్ చేసిందని తెలిపారు. హైకోర్టులో జీవో కొట్టివేతకు గురైందని, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా అనుకూల తీర్పు రాలేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు స్థానిక జనాభా వివరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని డెడికేటెడ్ కమిషన్ సూచించిందని వివరించారు. కమిషన్ సిఫారసుల మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. మిగిలిన 6 శాతం ప్రాతినిధ్యాన్ని పార్టీ పరంగా కల్పిస్తామని స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచడం, వారికి తగిన అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు మంత్రి సత్యకుమార్..
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!