Drugs Positive For Sharks: తాజాగా సొరచేపలకు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయా అంశంగా మారింది. బ్రెజిల్ దేశ ఆగ్నేయ తీరంలోని 13 సొరచేపలకు డ్రగ్స్ (కొకైన్) పాజిటివ్ వచ్చిందని ఆ దేశ సైంటిస్టులు తెలిపారు. నీటి కాలుష్యం, అటవీ నిర్మూలన సహా అక్రమ కొకైన్ ల్యాబ్ ల వ్యర్థాలు సముద్రంలో కలవడంతోనే సొరచేపల్లో ఈ కొకైన్ ఆనవాళ్లు కనిపించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ విషయం సంబంధించి ‘కొకైన్ షార్క్’ అనే టైటిల్ తో ఇంటర్నేషనల్ వీక్లీ మ్యాగజైన్ ‘సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్’ లో పూర్తి వివరాలు వెల్లడించారు.
NEET: బెంగాల్ అసెంబ్లీలో కీలక పరిణామం.. నీట్ రద్దు చేయాలని తీర్మానం
ఇదివరకు అధ్యయనాలలో నది, సముద్రం, మురుగు నీటిలో కొకైన్ డ్రగ్ జాడలను కనుగొన్నాయి. అంతే కాకుండా.. రొయ్యలు వంటి ఇతర సముద్ర జీవులలో వీటి ఆనవాళ్లు కూడా కనుగొనబడ్డాయి. బ్రెజిల్ లోని సావో పాలో రాష్ట్రంలోని శాంటోస్ బేలో బ్రౌన్ మస్సెల్స్, ఈల్స్ వంటి జంతువులలో అధిక స్థాయి కొకైన్ అవశేషాలు “తీవ్రమైన విషపూరిత ప్రభావాలను” కలిగిస్తున్నాయని ఇటీవల ఒక ప్రత్యేక అధ్యయనం కనుగొంది.
Mahesh – Rajamouli: కాస్కోండ్రా అబ్బాయిలూ.. ఇక డైరెక్ట్ ఎటాక్!
కానీ రియో షార్క్ లలో కనిపించే సాంద్రత ఇతర సముద్ర జంతువుల కంటే 100 రెట్లు ఎక్కువని పరిశోధకులు తెలిపారు. కొకైన్ సొరచేపలకు ఎలా చేరిందో మిస్టరీగా మిగిలిపోయింది. అయితే వాటికీ కొన్ని మార్గాల ద్వారా కొకైన్ చేరే అవకాశాలు ఉన్నాయి: ఒకటి ట్రాన్స్‌షిప్మెంట్ సమయంలో డ్రగ్ సముద్రంలో పడిపోయి లేదా అధికారుల నుండి తప్పించుకోవడానికి స్మగ్లర్లు దానిని సముద్రంలో పడేయడం. అయితే బ్రెజిల్ పెద్దగా కొకైన్‌ను ఉత్పత్తి చేయదు. కాకపోతే ఇది ఒక ప్రధాన ఎగుమతిదారు. ఫస్ట్ క్యాపిటల్ కమాండ్ (PCC) వంటి శక్తివంతమైన ముఠాలు టన్నుల కొద్దీ కొకైన్‌ను షిప్పింగ్ కంటైనర్ లలోకి లోడ్ చేసి ఐరోపాకు పంపుతున్నాయి. మరొక విషయం ఏమిటంటే.. కొకైన్ మలం, మూత్రం ద్వారా కూడా సముద్రంలోకి చేరుకుంది. వాటిద్వారా కూడా సొరచేపలకు చేరవచ్చు.