Minister Narayana: రాజధాని నిర్మాణానికి రూ.64,721.48 కోట్లు ఖర్చు.. మూడేళ్లలో పూర్తి..
- రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721.48 కోట్లు..
- మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం..
- అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721.48 కోట్ల రూపాయలు అని.. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారు.. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నాం అన్నారు.. వివిధ ఏజెన్సీలు, బ్యాంకుల నుండి లోన్లు, కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటులను పొందడం ద్వారా నిధుల సేకరణ జరుగుతోందదన్నారు మంత్రి నారాయణ. రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి నారాయణ..
Read Also: Ravindra Jadeja: దయచేసి పుకార్లు పుట్టించకండి.. హగ్ చేసుకుంటే..?
Also Read
- Andhra Pradesh: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది ఆచూకీ లేని ఓటర్లు
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Sajjala Ramakrishna Reddy: 2029లో వైసీపీదే అధికారం.. భారీ మెజారిటీతో గెలుస్తాం..
- Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
అయితే, 2019-24 మధ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తుచేశారు మంత్రి నారాయణ. అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలని జగన్ ఇదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రభుత్వం మారగానే ప్లేటు ఫిరాయించి మూడు ముక్కలాట ఆడి ఎక్కడా రాజధాని లేకుండా చేశారు.. గత ఐదేళ్లలో రాజధానికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. ప్రపంచలో టాప్ 5లో ఒకటిగా ఉండాలని సీఎం చంద్రబాబు రాజధానిని డిజైన్ చేశారని.. కానీ, శాడిజంతో కక్ష సాధింపుతో ఆర్ – 5 జోన్ చేసి 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారని దుయ్యబట్టారు.. అయితే, వారికి కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం.. న్యాయం చేస్తాం అన్నారు..
Read Also: SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌కు రోబోలు..
ఇక, రాజధానికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలిపి 13,400 కోట్లు లోన్ ఇస్తున్నాయి అని తెలిపారు మంత్రి నారాయణ.. KFW బ్యాంకు 5 వేల కోట్లు లోన్ ఇస్తుంది.. హడ్కో నుంచి 11000 కోట్ల రుణం రెండు మూడు రోజుల్లో వస్తుంది.. కేంద్రం గ్రాంట్ కింద 1560 కోట్లు ఇస్తుంది. భూములు అమ్మడం ద్వారా, అలాగే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవడం ద్వారా మిగిలిన నిధులు సమీకరిస్తాం అన్నారు.. అమరావతిలో 106 ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. అమరావతిలో మెయిన్ రోడ్లు 165 అడుగులు,185 అడుగులతో రెండేళ్లలో పూర్తి చేస్తాం.. ఎల్పీఎస్ రోడ్లు మూడేళ్లలో పూర్తి చేస్తాం. సగానికి పైగా నిర్మాణం జరిగిన అధికారుల భవనాలు ఏడాదిన్నరలో.. మిగతావి రెండేళ్లు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తాం. 2014-19 మధ్యలో అమరావతిలో 131 సంస్థలకు 1277 ఎకరాలు కేటాయించాం. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలతో కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
-
Indore: పెళ్లైన కొన్ని గంటలకే విడాకులు.. ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే..!
-
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
-
Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
-
CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!