రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721.48 కోట్ల రూపాయలు అని.. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి నారాయణ.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఇళ్లు, భవన నిర్మాణాలు, ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందన్నారు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ ప్రారంభమైంది.. కొత్త ఏడాది లో పనులు ప్రారంభం చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. అనుకున్నట్టుగానే 1200 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ప్రపంచ బాంక్.. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేబడుతున్న పనులకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇప్పటికే అనుమతి లభించిన 45 వేల కోట్ల రూపాయల నిర్మాణాలకి రేపు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపి.. టెండర్లు పిలవబోతున్నామని తెలిపారు. అమరావతి మొత్తం ప్రాజెక్టు వ్యయం 62 వేల కోట్ల రూపాయలు అని వెల్లడించారు. రాజమండ్రిలో పర్యటనలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. వచ్చే ఏడాది జులైలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ…