Nayantara : నయనతార రిలేషన్ షిప్ ల గురించి నాగార్జున ఏమన్నారంటే ?
- నయన్ రిలేషన్ షిప్స్ గురించి నాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఫోన్ వస్తే కంగారు పడేదన్న కింగ్
- నేనే ఆ సలహా ఇచ్చానన్న నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంపై ”నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్” డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. ఆమె సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి వంటి కీలక అంశాలతో ఈ డాక్యుమెంట్ తెరకెక్కించారు. దీనికి అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. నవంబర్ 18 నయన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ డాక్యుమెంటరీ తెలుగు, తమిళం, హిందీ, ఆంగ్ల భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల కాలంలో హీరో ధనుష్, నయనతార మధ్య విభేదాలు గురించి వార్తలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా ‘నానుమ్ రౌడీ దాన్’ ఫుటేజీని ఉపయోగించుకోనివ్వడం లేదని విమర్శిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన ధనుష్‌కి నయనతార ఇటీవల బహిరంగ లేఖ రాయడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇందులో ఆమె తన భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి పనిచేసింది. వివాదాల మధ్య ఓటీటీలో విడుదలైన నయన్ డాక్యుమెంటరీకి నెటిజన్లు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు.
Read Also:Bhagyashri Borse : ముచ్చటగా మూడు సినిమాలను లాక్ చేసిన భాగ్య శ్రీ బోర్సే
Also Read
ఈ డాక్యుమెంట్ లో నయనతార చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హీరోయిన్స్ చాలా మంది తమ ఎక్స్ రిలేషన్ షిప్స్ గురించి అంత వేగంగా ఓపెన్ అప్ కారు. అయితే నయనతార మాత్రం రెండు రిలేషన్స్ షిప్స్ గురించి డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది. అలాగే వారితో బ్రేక్ అప్ కి కారణాలు కూడా నయనతార వివరించింది. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా నయనతార గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నయనతార కెరీర్ స్టార్టింగులో నాగార్జునతో కలిసి ‘బాస్’ మూవీ చేసింది. తరువాత 2013లో ‘గ్రీకువీరుడు’ సినిమా చేసింది. ఇదిలా ఉంటే ‘బాస్’ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనల నాగార్జున చెప్పారు.
Read Also:OTT : ఓటీటీ లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కిష్కింద కాండం’
నయనతార తొలిసారి సెట్ లోకి వచ్చినపుడు ఆమె అందంతో పాటు నడకలో రాజసం కనిపించిందన్నారు. కొద్ది రోజులు ఆమెతో కలిసి పని చేసిన తర్వాత ఆమెతో స్నేహం చేయాలనిపించింది. నాతో మూవీ చేస్తోన్న సమయంలోనే ఆమె మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుసుకున్నాను. దాంతో నయనతార చాలా కంగారు పడుతూ ఉండేదని నాగార్జున తెలిపారు. ఫోన్ రింగ్ అయితే ఆమెలో తెలియని ఆందోళన కనిపించేది, మూడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయేది. నువ్వొక ఇండిపెండెంట్ అమ్మాయివి, వర్రీ అవుతూ ఇలాంటి రిలేషన్ లో ఎందుకు ఉన్నావని నయనతారని అడిగానని డాక్యుమెంటరీలో నాగార్జున చెప్పారు. ఈ రిలేషన్ షిప్ గురించి నయనతార సైతం క్లారిటీ ఇచ్చింది. ఫస్ట్ టైం నా రిలేషన్ నమ్మకంతో ఏర్పడిందన్నారు. అయితే అది కోల్పోయిన తర్వాత ఎక్కువ కాలం ఉండలేకపోయానని చెప్పారు. కానీ రిలేషన్ షిప్ బ్రేక్ అప్ అయితే అబ్బాయిలని ఎవరూ నిందించరని, అమ్మాయిల వైపే వేలెత్తి చూపిస్తారని నయన్ తన మనసులో మాటను బయటపెట్టింది.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!