YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: తాజా రాజకీయ పరిణాలు, రాష్ట్రంలోని పరిస్థితులు.. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, సాగునీరు, తాగునీటి సమస్యలపై జిల్లాల వారీగా సమీక్షించే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నీటి లభ్యత వంటి అంశాలపై జిల్లా అధ్యక్షుల నుంచి జగన్ వివరాలు తెలుసుకోనున్నారు.
అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఎలా సిద్ధం చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై జిల్లా అధ్యక్షులతో జగన్ చర్చించనున్నారు. పార్టీ బలోపేతం, జిల్లాల వారీగా సంస్థాగత పరిస్థితులు, నాయకులు-కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపైనా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా నేతలతో చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!