Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో కలిసి పనిచేయబోతున్నారన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గంలో ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.
‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు బుచ్చిబాబు సానా, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో సినిమా చేసే అవకాశం ఉందనే వార్తలు గతంలో ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబుతో మహేష్ సినిమా ఉండొచ్చనే టాక్ కూడా వినిపించింది. మరోవైపు అనిల్ రావిపూడి పేరు కూడా ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. మహేష్‌తో తన తదుపరి సినిమా లేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
Also Read
మరోవైపు.. సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు సినిమా చేసే అవకాశాలపై కూడా కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు వినిపిస్తోంది. మహేష్ కోసం భన్సాలీ ఓ పీరియాడిక్ కథను సిద్ధం చేసి నేరేట్ చేశారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ సినిమాతో బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు.
అలాగే రాజమౌళితో సినిమా పూర్తయితే.. మహేష్ బాబు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపును పొందే అవకాశం ఉంది. అందుకే ‘వారణాసి’ తర్వాత ఆయన ఎలాంటి కథను ఎంచుకుంటారు? ఏ దర్శకుడితో జతకడతారు? అనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?