BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Chief Selector Race: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన కాంట్రాక్ట్ అక్టోబర్ 4తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అగార్కర్ పదవీకాలంను మరోసారి పొడిగించే అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ వరకు అగార్కర్‌ను కొనసాగిస్తారనే ప్రచారం గతంలో జరిగినప్పటికీ.. ప్రస్తుతం ఆయన స్థానంలో కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించే దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ భారత క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజాలు ఉన్నారు. వీరిద్దరూ చీఫ్ సెలెక్టర్ పదవికి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. పార్థివ్, ప్రజ్ఞాన్ ఇద్దరూ ఐపీఎల్లో మూడుసార్లు విజేతలుగా నిలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) శుక్రవారం జరగనుంది. ఈ సమావేశంలో అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. బుధవారం జరిగిన సెలెక్షన్ మీటింగే అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా అధ్యక్షత వహించిన చివరి సమావేశం అయి ఉండొచ్చని సమాచారం. ఏజీఎం సమావేశం అనంతరం చీఫ్ సెలెక్టర్ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
బుధవారం జరిగిన సమావేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్లను ప్రకటించారు. అలాగే ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును కూడా ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అధ్యక్షత వహించింది. వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ఎంపిక చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. 39 ఏళ్ల రోహిత్‌ను వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో భాగంగా చూడటం లేదని సెలెక్టర్లు గతంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్‌కు చోటు దక్కడం చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!