సీటాడెల్‌తో సక్సెస్ కొట్టిన బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమా లో నటిస్తున్నాడు. పనిలో పనిగా పైసా ఖర్చు లేకుండా హీరోయిన్లతో ఫ్రీగా పబ్లిసిటీ చేయించుకుంటున్నాడు. కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మూవీని టాలీవుడ్ ముద్దుగుమ్మలు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. హీరో వరుణ్ ధావన్‌కు సీటాడెల్ పెద్దగా ప్లస్ కాలేదు. సమంత ఎక్కువ మార్కులు కొట్టేయడంతో అర్జెంట్‌గా తనకు మాత్రమే క్రెడిట్ దక్కే రిజల్ట్ చాలా అవసరం. దీంతో ఫోకస్ అంతా బేబీ జాన్‌పై పెట్టాడు. రీసెంట్లీ కండక్ట్ చేసిన సీటాడెల్ సక్సెస్ మీట్‌లో సమంతతో బేబీజాన్ మూవీలో నైన్ మటక్కా సాంగ్‌కుస్టెప్పులేయించి ఆమెతో ఫ్రీగా సినిమా ప్రమోషన్ చేయించుకున్నాడు.
Also Read : RGV : పుష్ప-2 టికెట్ ధరలు ఎక్కువంటున్న వాళ్లకు ఆర్జీవీ కౌంటర్.
తమిళ్ మూవీ తేరీ రీమేక్‌గా వస్తోన్న బేబీ జాన్ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తేరీలో సామ్ చేసిన క్యారెక్టర్ హిందీతో కీర్తి చేస్తోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లను తన భుజాన వేసుకున్నాడు హీరో వరుణ్ ధావన్. ఈ నేపథ్యంలో సన్నీ సంస్కారీకి తులసి కుమారి హీరోయిన్ జాన్వీ అండ్ టీంతో ఫన్నీ వీడియో చేయించాడు. ఇక బేబీ జాన్‌ను ఉచితంగా ప్రమోట్ చేశారు మిల్కీ బ్యూటీ తమన్నా అండ్ వామికా గబ్బీ. నైన్ మటక్కా హుక్స్ స్టెప్స్ వేసి సాంగ్ పైనే కాదు సినిమాపై హైప్ పెంచేలా చేశారు. టాలీవుడ్ నుండి వస్తోన్న కీర్తి సురేష్‌ను బాలీవుడ్ ఇండస్ట్రీకి వేరే లెవల్ ఇంట్రడక్షన్, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇక వరుణ్ కూడా రీల్స్, హుక్ స్టెప్పులతో సోషల్ మీడియాలో విపరీతంగా మూవీని ప్రచారం చేస్తున్నాడు. సినిమాపై బజ్ నడిచేందుకు స్టార్ హీరోయిన్లతో ఫ్రీగా పబ్లిసిటీ చేయించుకుంటున్నాడు కుర్ర హీరో.