Ambati Rambabu: టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు అరెస్ట్ దగ్గర్నుంచి టీడీపీ వాళ్లు.. నేరం చెయ్యలేదని ఎక్కడా చెప్పడం లేదని మంత్రి పేర్కొన్నారు. దొరికిన దొంగలకు మర్యాద చెయ్యలేదు అని వాదిస్తున్నారని.. అన్ని కోర్టుల్లో ఒకే రకమైన వాదనలు వినిపిస్తున్నారని ఆరోపించారు. సిమెన్స్ కంపెనీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు అని చెప్తోందని మంత్రి అన్నారు. చంద్రబాబు జీవితం అంతా స్టేలేనని మంత్రి అంబటి విమర్శించారు. ఆషామాషీగా చంద్రబాబు అరెస్ట్ జరగలేదని.. దొంగలు చాలా సార్లు తప్పించుకుంటారు కానీ అన్ని సార్లు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
Read Also: Chandrababu: చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి, పయ్యావుల కేశవ్ ములాఖత్
లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ లో అడ్డంగా బుక్కయ్యారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ కేసులో లోకేష్ తప్పించుకోవటం అసాధ్యమని తెలిపారు. పురందేశ్వరి ఢిల్లీ వెళ్ళింది చంద్రబాబును వదిలి వేయమని చెప్పడానికేనని తెలిపారు. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామని రాయబారం తీసుకువెళ్లారని.. ఏపీలో లిక్కర్ స్కామ్ అని దిక్కుమాలిన లెటర్ పట్టుకుని వెళ్లారని ఆరోపించారు. ఇదిలా ఉంటే మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలను పురంధరేశ్వరి ఎందుకు ఖండించ లేదని ప్రశ్నించారు.? పవన్ పీకే కాదు…కేకే…కిరాయి కోటిగాడు అని విమర్శించారు. పవన్ కాపులను గంపగుత్తగా టీడీపీకి తాకట్టు పెట్టేసారని మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Read Also: Santosham Awards: ఈసారి గోవాలో సంతోషం అవార్డ్స్.. సీఎంను కలిసిన సురేష్ కొండేటి