Santosham Awards 2023 to be held at goa: సంతోషం అవార్డులకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్ అయినా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో అవార్డుల ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చారు సురేష్ కొండేటి. తెలుగు సినిమాలకు గత 21 ఏళ్లకుగా అవార్డులు అందించిన ‘సంతోషం’ వారపత్రిక ఆధ్వర్యంలో 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2023 వేడుకలు ఈ ఏడాది గోవాలో గ్రాండ్ గా జరగనున్నాయని సురేష్ కొండేటి ఒక ప్రకటనలో వెల్లడించారు. అంతేకాదు అందుకు గాను గోవా ముఖ్యమంత్రితో సురేష్ కొండేటి భేటీ అయి గోవాలో ఎలా ఈవెంట్ జరపాలనే అంశం గురించి చర్చలు జరిపారు. ఇక ఆయనతో కలిసి ఉన్న ఫోటోలను సురేష్ కొండేటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Polimera 2: ‘మా ఊరి పొలిమేర -2`.. ఈసారి థియేటర్లో వణకాల్సిందే
ఇక ఈ ఏడాది జరగబోయే ఈవెంట్ కు సంబంధించిన డేట్ త్వరలోనే ప్రకటించనున్నారని, ఈ వేడుకల్లోనే ఓటీటీ అవార్డులు కూడా ప్రధానం చేయనున్నారని అంటున్నారు. ముందు తెలుగు సినిమాలకు మాత్రమే అవార్డులు ఇచ్చేవారు కానీ ఇప్పుడు గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియా లోని నాలుగు భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఈ అవార్డు వేడుకల్లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ బాషల సినిమాలకు అవార్డులు అందచేయనున్నారని తెలుస్తోంది. గతంలో ఈ ఈవెంట్ ను దుబాయ్ లో కూడా నిర్వహించడం గమనార్హం.