AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ..
- అక్రమ కట్టడాల తొలగింపును పరిశీలించాలి..
- నిపుణుల కమిటీకి మరోసారి హైకోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.. భీమిలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.. అక్రమ నిర్మాణాలు చేపట్టే సమయంలో ఉన్న రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పేర్లు ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు.. అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది.. అక్రమ నిర్మాణాలపై గతంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ ఆధ్వర్యంలో ఎక్స్‌పర్ట్ కమిటీ వేసింది హైకోర్టు.. అంతేకాదు, గతంలో అక్రమ నిర్మాణాలను ఆ కమిటీ పరిశీలించింది.. నివేదికను హైకోర్టుకు అందించింది.. మరోవైపు, ప్రస్తుతం భీమిలో అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న ఫోటోలను హైకోర్టు ముందించారు పిటిషనర్ పీతల మూర్తి యాదవ్.. అయితే, అక్రమ నిర్మాణాల ఫొటోలు చూసి విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు.. వెంటనే అక్రమ కట్టడాలను తొలగింపును పరిశీలించాలని ఎక్స్‌పర్ట్ కమిటీకి మరోసారి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నేహా రెడ్డి సహా మరో 5 రిస్టో బార్ అక్రమ నిర్మాణాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. ప్రధాన పిటిషన్‌లో అన్నింటిని పొందుపరచాలని పిటిషనర్‌ను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది..
Read Also: Sonia Gandhi: గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు
Also Read
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..