Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Qais Ahmad: ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ ఖైస్ అహ్మద్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్థాన్ డ్రా సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఖైస్.. మ్యాచ్ చివరి దశలో గాయం పేరుతో సమయం వృథా చేశాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.
అసలు విషయమేమిటంటే.. బంగ్లాదేశ్ నిర్దేశించిన 479 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ చివరి రోజు ఆటను 132/3తో ప్రారంభించింది. ఓపెనర్ సెదికుల్లా అటల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 332 బంతుల్లో 111 పరుగులు చేశాడు. సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు క్రీజులో నిలిచిన అతడి సెంచరీ.. టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ సాధించిన తొలి సెంచరీగా నిలిచింది.
Also Read
- IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
అటల్ ఔటైన తర్వాత బంగ్లాదేశ్ విజయానికి దగ్గరైనట్లుగా కనిపించింది. కానీ అసలు విషయం జరిగింది. స్కోరు 281/7గా ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన నంబర్-9 బ్యాటర్ ఖైస్ అహ్మద్.. ఆ తర్వాత మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. ఆట ముగియడానికి కేవలం 10 నిమిషాల సమయం మాత్రమే ఉండగా.. తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో బంతిని డిఫెండ్ చేసిన ఖైస్ ఒక్కసారిగా ఎడమ తొడ పట్టుకుని నొప్పితో కుప్పకూలాడు. ఆ తర్వాత నెమ్మదిగా లేచి నడవడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆఫ్ఘనిస్థాన్ ఫిజియో మైదానంలోకి వచ్చి అతడిని పరిశీలించాడు. ఈ ఘటనతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కామెంటేటర్లు సైతం దీనిని 2024 టీ20 ప్రపంచకప్‌లో గుల్బదిన్ నైబ్ చేసిన ఘటనతో పోల్చారు.
కామెంటేటర్ అహ్మద్ ఫర్హాద్ ఫిదాయ్ కూడా ‘‘ఖైస్ అహ్మద్ మళ్లీ చేశాడు.. ఇది గుల్బదిన్ నైబ్‌ను గుర్తు చేస్తోంది’’ అంటూ వ్యాఖ్యానించాడు. ఖైస్ గాయపడినట్లు కనిపించిన సమయంలో దాదాపు ఐదు నిమిషాల సమయం గడిచిపోయింది. దీంతో బంగ్లాదేశ్‌కు మరో ఓవర్ వేసే అవకాశం తగ్గిపోయింది. ఖైస్ అహ్మద్ కేవలం గాయం ఘటనతోనే కాకుండా బ్యాటింగ్‌తోనూ మ్యాచ్‌లో హైడ్రామా సృష్టించాడు. అతడు 7 పరుగుల వద్ద రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బంగ్లాదేశ్ ఫీల్డర్ చేసిన సులభమైన రనౌట్ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత కూడా ఖైస్ దూకుడుగా ఆడాడు. కేవలం డిఫెన్స్‌తో సమయం గడపాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. దగ్గరగా ఫీల్డర్లను ఉంచిన బంగ్లాదేశ్ బౌలర్లపై భారీ షాట్లు ఆడాడు. 80 బంతుల్లో 9 ఫోర్లు సాధించాడు. ఒక భారీ షాట్‌కు హసన్ మహ్ముద్ సులభమైన క్యాచ్‌ను వదిలేయడంతో ఖైస్కు మరో లైఫ్ లభించింది.
అంతేకాదు మ్యాచ్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం చివరి ఓవర్లో చోటుచేసుకుంది. ఖైస్ అహ్మద్ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో బంతిని నేరుగా బౌలర్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత మూడు బంతులను జాగ్రత్తగా డిఫెండ్ చేసి ఆఫ్ఘనిస్థాన్‌ను డ్రా దిశగా తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా చివరి బంతిని మిడ్‌వికెట్ మీదుగా మరో సిక్సర్‌గా కొట్టి మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఈ సమయంలో గ్యాలరీలో ఉన్న స్టార్ ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కూడా నవ్వుతూ కనిపించాడు. ఖైస్ అహ్మద్ 80 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేశాడు. మరోవైపు యామిన్ అహ్మద్జాయ్ 85 బంతుల్లో 19 పరుగులు చేసి అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 110 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అఫ్ఘనిస్థాన్ చివరి రోజు 132/3తో ఆట ప్రారంభించి 142 ఓవర్లలో 346/8 వద్ద ఇన్నింగ్స్ ముగించింది. బంగ్లాదేశ్ తరఫున ఎబాదత్ హొస్సేన్ 3/50, మెహదీ హసన్ మిరాజ్ 3/73తో రాణించినా.. జట్టుకు విజయం అందించలేకపోయారు. సెదికుల్లా అటల్ 111 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. హష్మతుల్లా షాహిదీ 36 పరుగులు చేశాడు. ఇస్మత్ ఆలం 4 పరుగులకే పరిమితమైనప్పటికీ 60 బంతులు ఎదుర్కొని బంగ్లాదేశ్ బౌలర్లను విసిగించాడు. చివర్లో ఖైస్ అహ్మద్, యామిన్ అహ్మద్జాయ్, జియా-ఉర్-రెహ్మాన్ అద్భుత పోరాటంతో ఆఫ్ఘనిస్థాన్ ఓటమి నుంచి బయటపడింది.
🏮OSCAR WINNING ACTING BY QAIS AHMAD 🤣
– Only 10 minutes were left for the draw and afganistan batsman started acting 🤯
Litton das and every bangladesh player were laughing 😂 https://t.co/2h9MWdfsKr
— VK (@Aur_vicky) October 13, 2026
LAST-OVER DRAMA! 🔥
A typical Qais Ahmad display under pressure as the #AfghanAtalan fight till the very end to secure a draw in the one-off Test against Bangladesh! 👏
#AFGvBD | #GloriousNationVictoriousTeam https://t.co/qDx11EEH5A
— Afghanistan Cricket Board (@ACBofficials) October 13, 2026
తాజావార్తలు
-
IND Vs WI 4th T20: ఉప్పల్‌లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్‌ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!