Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Ghee Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నిందితులు, వారి కుటుంబ సభ్యులు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.129.85 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఈ చర్యలు చేపట్టింది. తాజా అటాచ్మెంట్తో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన లేదా ఫ్రీజ్ చేసిన ఆస్తుల విలువ రూ.132.55 కోట్లకు చేరినట్లు సమాచారం.
భోలే బాబా, వైష్ణవి డెయిరీల ఆస్తులు అటాచ్
ఈడీ చర్యల్లో భాగంగా భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేసినట్లు వెల్లడించింది. భోలే బాబా డెయిరీ ప్రమోటర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వారి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులపైనా చర్యలు తీసుకుంది. అలాగే సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లా, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన స్థిర, చర ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర సంస్థలు, వ్యక్తుల ఆస్తులపైనా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది..
Also Read
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా?
ఈడీ దర్యాప్తు ప్రకారం, టీటీడీకి సుమారు రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెండర్లలో నేరుగా లేదా ఇతర డెయిరీలను మధ్యవర్తులుగా ఉపయోగించి పాల్గొన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు చెబుతున్నారు.. ఈ వ్యవహారంలో బోలే బాబా, సుకృతి ఫుడ్స్కు చెందిన తయారీ కార్యకలాపాలపై కూడా దర్యాప్తు సాగుతోంది. ఇక, దర్యాప్తులో భాగంగా, అసలైన ఆవు నెయ్యికి బదులుగా రిఫైన్డ్ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ వంటి నూనెలను ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది.. నెయ్యి రంగు, వాసన, చిక్కదనాన్ని పోలి ఉండేలా మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, బీటా-కెరోటిన్ వంటి పదార్థాలను కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మిశ్రమాలను రికార్డుల్లో వంట నూనెలుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్లు, ఇతర పత్రాలను ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.
నకిలీ బిల్లులు.. హవాలా మార్గంలో నగదు బదిలీలు
కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాన్ని సాధారణ డెయిరీ వ్యాపారంగా చూపించేందుకు నిందితులు తప్పుడు లెక్కలు సృష్టించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.. పామాయిల్ను బోగస్ కొనుగోలుదారులకు విక్రయించినట్లు రికార్డులు తయారు చేయడం, నకిలీ పాలు, నెయ్యి కొనుగోళ్లు జరిగినట్లు చూపించడం, స్కిమ్డ్ మిల్క్ వంటి ఉప ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి తప్పుడు పుస్తకాలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీల ద్వారా బ్యాంకింగ్ మార్గాల్లో నిధులను బదిలీ చేసి, అనంతరం హవాలా మార్గంలో నగదుగా వెనక్కి తెప్పించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నగదును బోగస్ పామాయిల్ కొనుగోలుదారులకు చెల్లింపులు చేయడానికి, మధ్యవర్తి డెయిరీలకు కమీషన్లు ఇవ్వడానికి, కుట్రలో భాగస్వాములైన వారికి ముడుపులు చెల్లించడానికి వినియోగించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.
ఇప్పటికే ప్రధాన నిందితుల అరెస్ట్
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరులోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలైన ఛార్జ్షీట్లను కూడా దర్యాప్తులో పరిగణనలోకి తీసుకున్నారట.. ఇప్పటికే ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విపిన్ జైన్, కైలాష్ చంద్ మంగ్లాలను ఈడీ అరెస్టు చేసినట్లు వెల్లడైంది. అంతకుముందు జూన్ 3న ఉత్తరాఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో రూ.2.7 కోట్ల నగదు, బ్యాంకు నిల్వలను సీజ్ చేసినట్లు సమాచారం. అయితే, తాజాగా అటాచ్ చేసిన రూ.129.85 కోట్ల ఆస్తులతో కలిపి, ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన లేదా ఫ్రీజ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.132.55 కోట్లకు చేరింది. కల్తీ నెయ్యి సరఫరా, నిధుల మళ్లింపు, మనీలాండరింగ్ వ్యవహారాల్లో మరికొందరి పాత్రపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
తాజావార్తలు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..