Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra Special Recipes: పండగ వచ్చిందంటే ఇళ్లన్నీ పిండివంటల ఘుమఘుమలతో నిండిపోవాల్సిందే. సాంప్రదాయ పిండివంటలను సరైన కొలతలతో, నూనె పీల్చకుండా, గుల్లగా మరియు కరకరలాడేలా ఇంట్లోనే ఎంతో సులువుగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. జంతికలు, కజ్జికాయలు, పల్లీ చెక్కీ, బియ్యప్పిండి చెక్కలు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
కారప్పొడి లేకుండా కరకరలాడే జంతికలు
Also Read
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
Also Read
- How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
- Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
కావాల్సిన పదార్థాలు:
* పొడి బియ్యప్పిండి – 3 కప్పులు
* శనగపిండి – 2 కప్పులు
* నూనె – 1 టేబుల్ స్పూన్
* వాము – 1 1/2 టీస్పూన్
* జీలకర్ర – 1/2 టీస్పూన్
* పసుపు – చిటికెడు (రంగు కోసం)
* ఉప్పు – 1 టీస్పూన్ (రుచికి సరిపడా)
* పచ్చిమిర్చి – 7 (
* వెల్లుల్లి రెబ్బలు – 10
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె
* తగినన్ని నీళ్లు
తయారీ విధానం:
నూనె పీల్చకుండా, ఎంతో గుల్లగా వచ్చే ఈ జంతికల కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెలో మూడు కప్పుల వరిపిండి (పొడి బియ్యప్పిండి), రెండు కప్పుల శనగపిండిని తప్పనిసరిగా జల్లించి తీసుకోవాలి. అందులో రంగు కోసం కొద్దిగా పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర మరియు ఒకటిన్నర టీస్పూన్ల వామును చేతులతో నలిపి వేసుకోవాలి. శనగపిండి వేస్తున్నాం కాబట్టి వాము జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పొడి పదార్థాలన్నీ బాగా కలిపిన తర్వాత, అందులో ఒక టేబుల్ స్పూన్ కరిగించిన వెన్న వేసి పిండికి బాగా పట్టించాలి. వెన్న లేకపోతే వేడి నూనెనైనా వాడుకోవచ్చు. పిండిని ముద్దలా పట్టుకుంటే నిలబడి, విరిస్తే విరిగిపోయేలా వెన్న కలవాలి.
కారం కోసం ఆరేడు ఘాటైన పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో మరికొన్ని నీళ్లు కలిపి, ఆ మిశ్రమాన్ని వడకట్టి ఆ రసాన్ని పిండిలో పోయాలి. మొదట ఈ నీటితోనే పిండిని కలిపి, ఆపై తగినన్ని మామూలు నీళ్లు చల్లుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మెత్తని ముద్దలా కలుపుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా తడి గుడ్డను కప్పి ఉంచాలి. జంతికల గొట్టంలో మీడియం రంధ్రాలున్న బిళ్ళను ఉంచి, పిండిని నింపి కాగుతున్న నూనెలో చక్రంలా చుట్టుకోవాలి. నూనె నురగ తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పి, మంచి రంగు వచ్చేవరకు వేయించి తీసుకుంటే రెండు మూడు వారాల పాటు కరకరలాడే జంతికలు సిద్ధమవుతాయి.
నోరూరించే స్టఫింగ్తో గుల్లగా వచ్చే కజ్జికాయలు
కావాల్సిన పదార్థాలు:
పై పిండి కోసం:
* మైదా పిండి – 250 గ్రాములు
* నెయ్యి (లేదా కాచిన నూనె) – 3 స్పూన్లు
* ఉప్పు – చిటికెడు
* నీళ్లు – పిండి కలపడానికి సరిపడా
లోపలి స్టఫింగ్ కోసం:
* పుట్నాల పప్పు (వేపుడు శనగపప్పు) – 1 1/2 కప్పు
* బెల్లం తురుము – 1 1/2 కప్పు (సుమారు 250 గ్రాములు)
* ఎండు కొబ్బరి తురుము – 1 కప్పు
* పల్లీలు – 1/4 కప్పు
* తెల్ల నువ్వులు – 1/4 కప్పు
* బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) – 1/4 కప్పు
* జీడిపప్పు, బాదం పలుకులు – 1/4 కప్పు
* నెయ్యి – 2 స్పూన్లు (రవ్వ, డ్రై ఫ్రూట్స్ వేయించడానికి)
* యాలకులు – 4 నుండి 5
* ఉప్పు – చిటికెడు
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె
తయారీ విధానం:
పై లేయర్ క్రిస్పీగా రావడం కోసం ఒక పావు కేజీ (సుమారు రెండు కప్పులు) మైదా పిండిని తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, మూడు స్పూన్ల నెయ్యి (లేదా కాచిన నూనె) వేసి పిండిని చేతులతో బాగా రబ్ చేస్తూ కలపాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకొని, ఐదారు నిమిషాలు బాగా ఒత్తుకోవాలి. ఈ పిండిపై మూతపెట్టి కనీసం అరగంట పాటు నాననివ్వాలి.
లోపలి స్టఫింగ్ కోసం పాన్‌లో పావు కప్పు పల్లీలు దోరగా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టాలి. అలాగే పావు కప్పు నువ్వులను డ్రై రోస్ట్ చేయాలి. రెండు స్పూన్ల నెయ్యిలో పావు కప్పు జీడిపప్పు, బాదం పలుకులను వేయించి తీసి, అదే నెయ్యిలో పావు కప్పు బొంబాయి రవ్వను మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మిక్సీ జార్లో ఒకటిన్నర కప్పుల పుట్నాల పప్పును కొద్దిగా రవ్వలా పట్టుకొని, అందులోనే పల్లీలు, నువ్వులు, వేయించిన రవ్వ, యాలకులు వేసి ఒకసారి తిప్పాలి. ఆపై కప్పున్నర (పావు కేజీ) తరిగిన బెల్లం వేసి పల్స్ మోడ్‌లో పొడిపొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు వేసి కలిపితే స్టఫింగ్ సిద్ధమవుతుంది.
నానిన పిండిని చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసి, మరీ పల్చగా లేదా మందంగా కాకుండా పూరీలా ఒత్తుకోవాలి. కజ్జికాయల చెక్కపై కొద్దిగా పొడిపిండి చల్లి, పూరీని ఉంచి మధ్యలో ఒకటిన్నర స్పూన్ల స్టఫింగ్ పెట్టాలి. అంచుల వెంబడి నీళ్లు తడిపి గట్టిగా ప్రెస్ చేసి మూసివేయాలి. మీడియం వేడి ఉన్న నూనెలో వీటిని వేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించుకుంటే గుల్లగా ఉండే కజ్జికాయలు సిద్ధం.
స్వీట్ షాప్ స్టైల్ పల్లీ చిక్కీ
కావాల్సిన పదార్థాలు:
* పల్లీలు (వేరుశనగ) – 1/2 కేజీ (2 గ్లాసులు)
* బెల్లం తురుము – 300 గ్రాములు (1 1/4 గ్లాసు)
* నీళ్లు – 1/4 గ్లాసు
* యాలకుల పొడి – 1/2 టీస్పూన్
* నెయ్యి – 1 స్పూన్ (ప్లేట్లకు రాయడానికి మరికొద్దిగా)
తయారీ విధానం:
పంటికి అతుక్కోకుండా కరకరలాడుతూ రావడానికి అరకేజీ (రెండు గ్లాసులు) పల్లీలను మంటను లో-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి లోపలి వరకు వేగేలా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్లేట్‌కు, అలాగే అడుగు ఫ్లాట్‌గా ఉండే ఒక చిన్న గిన్నెకు నెయ్యి రాసి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి.
అరకేజీ పల్లీలకు 300 గ్రాముల బెల్లం (ఒకటింపావు గ్లాసు తురుము) సరైన కొలత. కడాయిలో బెల్లం తురుము, పావు గ్లాసు నీళ్లు పోసి కరిగించి, నలకలు లేకుండా వడకట్టుకోవాలి. శుభ్రం చేసిన కడాయిలో ఆ బెల్లం నీటిని పోసి లో-మీడియం మంటపై ముదురు పాకం వచ్చే వరకు మరిగించాలి. కొద్దిగా పాకాన్ని నీళ్లలో వేసి చూస్తే గట్టిగా మారి, ప్లేట్‌కు కొట్టినప్పుడు ‘టంగ్’ అని శబ్దం రావాలి. ఈ దశలో కొద్దిగా యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి వేసి, వెంటనే వేయించిన పల్లీలను వేసి వేగంగా కలపాలి. వెంటనే స్టవ్ ఆపేసి, నెయ్యి రాసిన ప్లేట్లోకి మిశ్రమాన్ని పోసి, నెయ్యి రాసిన గిన్నెతో సమానంగా పరుచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసిన చాకుతో గాట్లు పెట్టుకొని, పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా విడదీస్తే పర్ఫెక్ట్ చిక్కీ రెడీ అవుతుంది.
గుల్లగా, నూనె పీల్చని బియ్యప్పిండి పప్పు చెక్కలు
కావాల్సిన పదార్థాలు:
* పొడి బియ్యప్పిండి (వరిపిండి) – 1 కేజీ (4 గ్లాసులు)
* పెసరపప్పు – 1/2 గ్లాసు (అరగంట నానబెట్టినది)
* లావు సగ్గుబియ్యం – 1/4 గ్లాసు (అరగంట నానబెట్టినది)
* వెన్న – 2 పెద్ద స్పూన్లు
* పచ్చిమిర్చి – 10
* అల్లం – 1 1/2 అంగుళాల ముక్క
* రాళ్ల ఉప్పు (కళ్లుప్పు) – 1 స్పూన్ (రుచికి సరిపడా)
* కారం పొడి – 1 స్పూన్
* జీలకర్ర – 1 1/2 స్పూన్
* కరివేపాకు – 1 కప్పు (సన్నగా తరిగినది)
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె
* తగినన్ని నీళ్లు
తయారీ విధానం:
ఈ చెక్కల కోసం పావు గ్లాసు లావు సగ్గుబియ్యం, అర గ్లాసు పెసరపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు విడివిడిగా నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో అంగుళంన్నర అల్లం ముక్క, 10 పచ్చిమిర్చి, ఒక స్పూన్ రాళ్ల ఉప్పు వేసి నీళ్లు లేకుండా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అలాగే ఒక కప్పు కరివేపాకును సన్నగా తరిగి ఉంచుకోవాలి.
ఒక పెద్ద గిన్నెలో నాలుగు గ్లాసులు (ఒక కేజీ) పొడి బియ్యప్పిండిని తీసుకోవాలి. అందులో నీళ్లు తీసేసిన సగ్గుబియ్యం, పెసరపప్పు, కరివేపాకు తరుగు, ఒకటిన్నర స్పూన్ల జీలకర్ర, రుబ్బిన అల్లం-మిర్చి పేస్ట్, ఒక స్పూన్ కారం మరియు రెండు పెద్ద స్పూన్ల వెన్న వేయాలి. వెన్న వేయడం వల్లే చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. మొదట నీళ్లు పోయకుండా పిండిని చేతులతో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని మామూలు నీళ్లు చల్లుకుంటూ మరీ లూజ్‌గా కాకుండా మెత్తని ముద్దలా కలపాలి.
ఈ పిండిని చిన్న చిన్న గోలీల సైజు బాల్స్‌లా చేసుకోవాలి. పూరీ ప్రెస్ లేదా ప్లాస్టిక్ కవర్‌పై నూనె రాసి, ఈ బాల్స్‌ను పెట్టి మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. బాగా కాగిన నూనెలో చెక్కలను వేసి, వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి రెండు వైపులా వేయించాలి. నూనె నురగ పూర్తిగా తగ్గిపోయాక జాలి గరిటెతో తీసుకుంటే నూనె పీల్చకుండా ఎంతో క్రిస్పీగా ఉండే చెక్కలు సిద్ధమవుతాయి.
తాజావార్తలు
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!