Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Heavy Rains To Lash South Coastal And Rayalaseema Districts Over Next 3 Days

AP Heavy Rains: కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

Published Date :November 28, 2024 , 7:00 pm
By Sudhakar Ravula
  • ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
  • రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన..
AP Heavy Rains: కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది.. ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 3కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందన్నారు. ఇది శుక్రవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ ఈదురుగాలుల వేగంతో తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి (29-30) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read Also: RGV Tweets: కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్.. 22 పాయింట్లతో..

అయితే, ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది..

Read Also: Sircilla: కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే- ఐఏఎస్ అధికారుల సంఘం..

రేపు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో అతిభారీ నుండి అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల మరియు అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఇక, 30వ తేదీన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ మరియు తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల మరియు అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది..

Read Also: TG Congress MP’s: మా పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు..

మరోవైపు డిసెంబర్ 1వ తేదీన విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం మరియు వైఎస్ఆర్ జిల్లాల్లోని జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2వ తేదీన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, మరియు అనంతపురం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap heavy rains
  • Heavy rains
  • Rayalaseema
  • South Coastal

తాజావార్తలు

  • Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు

  • Varanasi: మహేష్ – రాజమౌళి ‘వారణాసి’లో మరో బాలీవుడ్ భామ?

  • Partner Choice: భర్తను వదిలి ఇష్టపడే వ్యక్తితో జీవించే హక్కు గెలిచింది.. 19 ఏళ్ల భార్యకు 40 ఏళ్ల భర్త కేసులో హైకోర్టు తీర్పు

  • Israel-Iran War: ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ.. ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం

  • Actress Subhashini Suicide: భర్త వీడియో కాల్.. ఆత్మహత్య చేసుకున్న నటి సుభాషిణి..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions