Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jadal Look: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సంచలన విజయం తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న నాని.. సినిమా కథ, తన డిఫరెంట్ లుక్ వెనుక ఉన్న రిస్క్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో నాని కనిపించనున్న జడల్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లుక్ వెనుక ముందు తాను ఎదుర్కొన్న భయాలను నాని నిర్మొహమాటంగా బయటపెట్టారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. “డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలని అడిగినప్పుడు కథపరంగా దానికి బలమైన కారణం ఉన్నప్పటికీ మొదట నేను కాస్త ఆలోచించాను. ఇది బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంది.. ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియాలో పెద్ద మీమ్ మెటీరియల్ అయిపోతానేమో, ట్రోల్స్ వస్తాయేమో అనిపించింది. కానీ ‘ఆయా షేర్’ సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాను. అదే ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది. ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం, అభిమానులు తమ ఫేవరెట్ హీరోలకు ఈ తరహా జడలు వేసి ఏఐ ఫొటోలు క్రియేట్ చేయడం, చివరకు గణేశ్ విగ్రహాలకు కూడా ఆ గెటప్ వేయడం చూస్తే నమ్మకంతో పనిచేస్తే అన్నీ వాటంతట అవే కుదురుతాయని అర్థమైంది” అని చెప్పుకొచ్చారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ప్రస్తుత కమర్షియల్ సినిమాల ధోరణిపై నాని తనదైన శైలిలో విశ్లేషించారు. “ఇటీవల వస్తున్న చాలా కమర్షియల్ చిత్రాల్లో కేవలం పాటలు, ఫైట్ల కోసమే ఎమోషన్స్‌ను పైపైన స్పృశించి వదిలేస్తున్నారు. హీరో విలన్‌ను కొడుతున్నప్పుడు కూడా ప్రేక్షకుడిలో ఆ స్థాయిలో కోపం గానీ, సిట్యుయేషన్ ఇంటెన్సిటీ గానీ కలగడం లేదు. కానీ మన చిన్నతనంలో చూసిన ‘బాజీగర్’ వంటి భారీ కమర్షియల్ సినిమాల్లో భావోద్వేగాలు చాలా లోతుగా, నిజాయతీగా ఉండేవి. ‘ది ప్యారడైజ్’ అచ్చం అలాంటి బలమైన ఎమోషన్స్‌ను పట్టుకునే అరుదైన చిత్రం. తెరపై పాత్ర పడే బాధైనా, ప్రేమ అయినా చూసే ప్రేక్షకుడికి గుండెల్లో హత్తుకుంటుంది. సినిమా మొదలైన తర్వాత థియేటర్లలో ఉన్నామనే మాటే మర్చిపోయి, ఆ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లిపోతారు” అంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, అందుకే తన ఇతర ప్రాజెక్టుల కంటే ఈ సినిమాకే ఎక్కువ కాల్షీట్లు, అధిక శ్రమ కేటాయించానని నాని తెలిపారు. ఔట్ పుట్ చూశాక తన నిర్ణయం నూటికి నూరు శాతం సరైనదేనని అనిపించిందని అన్నారు. కయదు లోహార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఈ సినిమాను నార్త్ బెల్ట్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!