Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Ram Gopal Varma Tweets With 22 Points On Cases In Andhra Pradesh

RGV Tweets: కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్.. 22 పాయింట్లతో..

Published Date :November 28, 2024 , 7:23 pm
By Sudhakar Ravula
  • ఏపీలో తనపై కేసుల నమోదుపై స్పందించిన ఆర్జీవీ..
  • వరుస ట్వీట్లతో 22 పాయింట్లు లేవనెత్తిన వర్మ..
RGV Tweets: కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్.. 22 పాయింట్లతో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

RGV Tweets: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.. వర్మ సోషల్‌ మీడియా పోస్ట్‌పై వరుసగా కేసులు నమోదు.. విచారణకు రావాలంటూ పోలీసుల నోటీసులు.. ఆ కేసులు క్వాష్‌ చేయాలంటూ.. మరోవైపు.. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ వర్మ హైకోర్టు మెట్లు ఎక్కడం.. ఇంకో వైపు.. వర్మ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలించడం.. అజ్ఞాతంలో ఉండి.. వర్మ వీడియోలు రిలీజ్ చేయడం.. ఇలా వర్మ వ్యవహారం మీడియాలో.. సోషల్‌ మీడియాలో రచ్చగా మారింది.. అయితే, ఈ వ్యవహారంపై మరోసారి వరుస ట్వీట్లతో.. 22 పాయింట్లు లేవతన్నారు ఆర్జీవీ..

నా కేసు-RGV అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పోస్టు పెట్టిన ఆయన.. జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్‌ చేస్తూ.. 22 పాయింట్లు లేవనెత్తారు.. ఇక, ఆర్జీవీ లేవనెత్తిన అంశాలను వరుసగా పరిశీలిస్తే..

1. నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.

2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసు లోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు?

3. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్ గా అసలు సంబంధం లేని వ్యక్తులా మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారంట.

4. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే 4 వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్ లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.

5. నాకు నోటీసు అందిన వెంటనే, నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది. కానీ, నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం, లేకపోతే వీడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. అదే టైమ్‌లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు, నా వాళ్ళకి అనుమానం కలిగింది.

6. నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటాను, చాలా సార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకు సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.

7. నేను పెట్టాను అంటున్న పోస్టులు, వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.

8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.

9. BNS 336(4).. ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డు ను కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి. ?

10. BNS 353(2).. తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.

11. BNS 356. (1).. ఎవరైనా మాటల ద్వారా గానీ , రాతల ద్వారా గానీ , సంకేతాల ద్వారా గానీ , చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం
మీమ్ లతో పరువు నష్టం దవలేస్తే రోజుకి లక్చ కేసులవుతాయి.

12. BNS 61(2).. ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానం లో చద్దబద్ద మైన ఫలితం పొందడం. దీని లింక్ నా కేసు కెంటి?

13. BNS 196.. వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం. ?

14. SECTION 67 IT act.. ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించటం Section 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది ?

15. నా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం , భారత రాజ్యాంగం ARTICLE 19(1)a ప్రకారం న్యాయబద్ద మైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.

16. ప్రతి ప్రజాస్వామ్య సమాజం లో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్ గా మాట్లాడగలగడం .. అదే విధంగా ఇతరుల నుండీ ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ యొక్క ప్రధాన హక్కు, ఈ హక్కు ను నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.

17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను,భావాలను, ఉద్దేశాలను, శైలీని,ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్ లొ ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము etc రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.

18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు…ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్ గా తీసుకుంటే దేశం లొ సగం మంది పైన కేసు పెట్టాలి.

19. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే, నా కున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారనకి హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లొ పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసు కు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసు లోపలకి రాలేదు, నన్ను అరెస్టు చేయటానికి వచ్చాం అని కూడా చెప్పలేదు.

20. ఇప్పుడూ మీడియా లో వస్తున్న కథనాలు…నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతి సారి లాగే హై డ్రామా క్రియేట్ చేసింది.

21. నేను నా మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్ కి నాకు ఆఫీసర్ల నుండీ ఎటువంటి సమాధానం రాలేదు…నా మీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుందదనిపించి, అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తీ నీ లేక ఒక గ్రూప్ నీ నిందించటం లేదు…కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది.

22. నేను చట్టాన్ని గౌరవిస్తాను ..అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను. ఎప్పటి లాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్ గా చేసి ఒక సినిమా తీసింది . నాకు కూడా వాళ్ళకున్నత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?

నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews

1.

నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…

— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ram gopal varma
  • RGV 22 Points
  • RGV Cases
  • RGV Tweets

తాజావార్తలు

  • Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం

  • Israel – Iran War: ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఆ అగ్ర రాజ్యంలో మాత్రం స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ..

  • France-Iran: గల్ఫ్ దేశాలకు ఫ్రాన్స్ మద్దతు.. ఇరాన్‌‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన

  • Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన

  • Israel-Iran war: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి, పెద్ద సంఖ్యలో నిఘా అధికారులు మృతి

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions