Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మరింత బలోపేతం కానుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తాజా వాతావరణ నివేదికలు కూడా ఇదే దిశగా వ్యవస్థ కదులుతున్నట్లు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వాయుగుండం పూరీకి సుమారు 310 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 310 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి 390 కిలోమీటర్లు, విశాఖపట్నానికి తూర్పున 470 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. సముద్రం తీవ్ర అలజడిగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
బుధవారం అల్లూరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, సోమవారం రాత్రి 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా శంఖవరంలో 60.7 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా నందలూరులో 52.5 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 48.2 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా దుర్వేసిలో 45.5 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 45.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా రామకుప్పంలో 41.2 మిల్లీమీటర్లు, అనంతపురం జిల్లా డి.హీరేహాల్లో 35.5 మిల్లీమీటర్లు, చిత్తూరు అర్బన్‌లో 34.2 మిల్లీమీటర్లు, కర్నూలు జిల్లా పత్తికొండలో 31.5 మిల్లీమీటర్లు, తిరుపతిలో 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!