ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది.. ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 3కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 480…