Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధించాలనే బలమైన సంకల్పం, దేశ సేవ చేయాలనే తపన ఉంటే ఏ కష్టాలూ మనల్ని ఆపలేవు. ఇందుకు ఉత్తరాఖండ్‌కు చెందిన ఐపీఎస్ తృప్తి భట్ విజయగాథే నిదర్శనం. అల్మోడా జిల్లాలో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించిన తృప్తి, పంత్నగర్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండే ఆమె, ఇంజనీరింగ్ పూర్తికాగానే తన ప్రతిభతో ఏకంగా 16 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ఇందులో దేశంలోని అత్యున్నత అంతరిక్ష సంస్థ అయిన ఇస్రోలో సైంటిస్ట్/ఇంజనీర్ ఉద్యోగంతో పాటు ఎన్టీపీసీ వంటి ప్రముఖ కంపెనీల నుంచి వచ్చిన అద్భుతమైన ఆఫర్లు కూడా ఉన్నాయి.
చాలామంది ఇస్రో లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం వస్తే వెంటనే చేరిపోతారు. కానీ.. తృప్తి లక్ష్యం కేవలం ఒక సాధారణ ఉద్యోగం చేయడం కాదు.. సమాజంలో నేరుగా మార్పు తీసుకురావాలనేది ఆమె కోరిక. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఆమె ఇస్రో ఉద్యోగంతో పాటు ఆ 16 ప్రభుత్వ ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారు. సివిల్ సర్వీసెస్ ద్వారా దేశానికి సేవ చేయాలనే తన కలను నిజం చేసుకునేందుకు యూపీఎస్సీ పరీక్షల వైపు అడుగులు వేశారు.
Also Read
- Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
- RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
- Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
- Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
ఎలాంటి పెద్ద కోచింగ్ సెంటర్ల సహాయం లేకుండా, కేవలం సెల్ఫ్ స్టడీ, సరైన ప్రణాళికతో ముందుకు సాగారు. తన మొదటి ప్రయత్నంలోనే 2013 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా 168వ ర్యాంకు సాధించి ఐపీఎస్ (IPS) అధికారిగా ఎంపికయ్యారు. ఆమెకు ఉత్తరాఖండ్ క్యాడర్ కేటాయించబడింది. అక్కడ తన నిజాయితీ, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు పొంది ‘సూపర్‌కాప్’ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తన అనుభవాల ద్వారా విద్యార్థులకు తృప్తి భట్ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. కేవలం ఏదో ఒక ఉద్యోగం పొందడమే కాకుండా, జీవితంలో మన అసలు లక్ష్యం ఏమిటో తెలుసుకొని ముందుకు సాగాలని ఆమె కోరుతున్నారు. వైఫల్యాలకు భయపడకుండా నిరంతరం కష్టపడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించారు. తమ సొంత సామర్థ్యాలపై నమ్మకముంటే ప్రపంచంలో ఏ సవాలునైనా ఎదుర్కోవచ్చని తృప్తి భట్ జీవితం మనకు నేర్పుతుంది. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం లక్ష్య సాధన కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!